For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొయ్యల (ప్రాన్)కర్రీ: కొంకన్ స్టైల్

|

కొంకన్ స్టైల్ రిసిపిలు అంటే చాలా మందికి ఇష్టం. నిజానికి ఈ కొంకన్ స్టైల్ రిసిపిలు హోం మేడ్ రిపిలు కాదు, ఎక్కువగా అవుట్ సైడ్ రెస్టారెంట్స్ లో ఎక్కువగా తయారుచేస్తుంటారు. రొయ్యలుతో తయారుచేసే వంటలు చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటాయి. అందులో ఈ కొంకన్ స్టైల్ రిసిపిని ట్రెడిషనల్ స్టౌల్లో తయారుచేయబడినది. ఈ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు అతి తక్కువ పదార్థాలు మాత్రమే ఈ వంట తయారీకి ఉపయోగిస్తున్నారు. మరి మీరు కూడా ఈ టేస్టీ ట్రెడిషినల్ కొంకన్ స్టైల్ రిసిపిని రుచిచూడలంటే క్రింది పద్దతిని అనుసరించాల్సిందే.

Konkan Style Prawns Recipe

కావల్సిన పదార్థాలు:
రొయ్యలు ఒలిచిన: 1kg(పై షెల్ తొలగించి శుభ్రం చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 3(పెద్దవి, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 3 (పెద్దవి, చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
నూనె: 4tsp
వెల్లుల్లి :3tsp (పేస్ట్)
పసుపు: 1tsp
చింతపండు: 1tsp
కారం: 1tsp
లవంగాలు 2
దాల్చిన చెక్క : చిన్న ముక్క
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. శుభ్రం చేసి పెట్టుకొన్న రొయ్యలు, వెల్లుల్లిపేస్ట్, పసుపు, కారం, చింతపండు మరియు ఉప్పు వేసి, అన్నింటిని బాగా మిక్స్ చేసి 15-30నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో లవంగాలు, మరియు చెక్క వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు ముక్కలు వేసి మరో 5-7నిముషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ , మద్యమద్యలో కలియబెడుతూ వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులో మ్యారినేట్ చూసిపెట్టుకొన్న రొయ్యలు వేసి, వాటి ఒరిజినల్ కలర్ గ్రే కలర్ తొలగిపోయే వరకూ వేయించుకోవాలి.
5. తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి 5 నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి. టమోటోతో పాటు రొయ్యలు కూడా వేగుతూ చిన్నగా కుచించుకుంటూ వేగుతూ, నూనె విడిపోతూ పైకి తేలుతుంది.
6. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి. తర్వాత అవసరం అయితే ఉప్పు కూడా వేసి వేయించుకోవాలి.
7. అంతే కొంకన్ స్టైల్ ప్రాన్ రిసిపి రెడీ. దీన్ని వేడి వేడి అన్నం లేదా చపాతీలతో సర్వ్ చేయండి.

English summary

Konkan Style Prawns Recipe

"A lot of recipes from the Konkan belt of India, are handed down through generations and yet, rarely shared outside the family tree. A mother would pass it on to her daughter, who would after marriage carry it with her as her trump card.
Story first published: Friday, January 31, 2014, 17:37 [IST]
Desktop Bottom Promotion