For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాల్వాని ప్రాన్ కర్రీ: నాన్ బెజ్ స్పెషల్

|

‘మాల్వాని' అనేది ఒక ప్రదేశం నుండి వచ్చిన పేరు ఇది మహారాష్టలోని ఒక ప్రాంతం పేరు ‘మాల్వాన్'. ఇది గోవాకు చాలా దగ్గరలో ఉంటుంది. మాల్విన్ వంటలు ఇటు మహారాష్ట్ర, అటు గోవా స్టైల్లో తయారుచేస్తారు.

మాల్వాని వంటలకు కొబ్బరి చాలా ముఖ్యమైన పదార్థం. కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి లేదా కొబ్బరిపాలు ఏదో ఒకటి ఉపయోగించి తయారుచేస్తారు . ఇక్కడ ఒక అద్భుతమైన రుచికరమైన సీఫుడ్ మీకోసం అంధిస్తున్నాము. ఇది మాల్వాని ప్రాన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది . కొన్ని సువాసన గల మసాలా దినుసులతో తయారుచేయబడింది. మరి మాల్వాని డిష్ మీరు చేయాలంటే . ఎలా తయారుచేయాలో ప్రయత్నించండి.

Malvani Prawn Curry Recipe

ప్రాన్స్ : 500gms
చింతపండు గుజ్జు: 2tbsp
వెల్లుల్లి రెబ్బలు: 3-4 (ముక్కలుగా చేసుకోవాలి)
కొబ్బరి పాలు: 1cup
పసుపు: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: 2tbsp
కొత్తిమీర తరుగు: 2tbsp (అలంకరించడం కోసం)
మసాలా పేస్ట్ కోసం
కొబ్బరి: ½cup(తురిమినది)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
జీలకర్ర: 1tbsp
సోంపు: ½tsp
మెంతుai: ½ tsp
యాలకులు: 2
దాల్చిన చెక్క: 1
ఎండు మిర్చి: 2
లవంగాలు: 3
నూనె: 1tbsp
నీరు: 2tbsp

తయారుచేయు విధానం :
1. ముందుగా ప్రాన్స్ ను శుభ్రంగా కడగాలి. తర్వాత చిటికెడు ఉప్పు చేర్చి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకలు, కారం, సోంపు, ధనియాలు, మెంతులు వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు కొబ్బరి తురుము వేసి మరో 5నిముషాలు వేయించుకోవాలి.
4. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, పక్కన పెట్టుకొన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
5. చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్ లో వేసి నీరుపోసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వెల్లులి వేసి వేయిచుకోవాలి. అందులోని పసుపు, మసాలా పేస్ట్ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులో కొబ్బరిపాలు, ఉప్పు, వేసి మిక్స్ చేసుకోవాలి.
8. చివరగా ప్రాన్స్ (రొయ్యలను)వేసి మీడియం మంట మీద 10నిముషాలు ఉడికించుకోవాలి. 5నిముషాలు తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

English summary

Malvani Prawn Curry Recipe

The name 'Malvani' comes from the name of a small town called Malvan which is situated on the west coast of Maharashtra. This area is also close to Goa. Hence, the Malvani cuisine is a mix of Maharashtrian and Goan styles of cooking.
Story first published: Saturday, February 8, 2014, 14:05 [IST]
Desktop Bottom Promotion