For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముంబై స్టైల్ స్పైసీ ఎగ్ బుర్జ్(వీడియో)

|

మన ఇండియన్ వంటల్లో ఎగ్ బుర్జ్ వంట తెలియని వారుండరు. ఎందుకంటే ఇది చాలా సులభంగా త్వరగా తయారయ్యే వంట కాబట్టి, చాలా మంది ఒంటిరిగా(బ్యాచులర్స్)ఉండే వారు, ఉద్యోగస్తులు, బిజీ లైఫ్ గడిపేవారికి చిటికెలో మైండ్ లోకి వచ్చే ఆలోచన, హెల్తీ ఎగ్ బుర్జ్. ఇది ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. మరియు ఆరోగ్యం కూడా. ఈ ఎగ్ బుర్జ్ డాబా, మరియు స్ట్రీట్ స్టాల్స్ లో మీరు రుచి చూసే ఉంటారు. అయితే అంతే రుచితో మీరు ఇంట్లో కూడా ఈ ఎగ్ బుర్జ్ ను తయారుచేసుకోవచ్చు.

ఈ స్పెషల్ ఎగ్ బుర్జ్ రిసిపి చాలా సింపుల్ గా మరియు త్వరగా తయారవుతుంది. మరియు ఈ ముంబాయ్ స్టైల్ ఎగ్ బుర్జ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇందులో అదనంగా పావ్ బాజీ మసాలాను జోడించడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మరి మీరు కూడా కొత్త రుచితో ఎగ్ బుర్జ్ ను టేస్ట్ చూడాలనుకుంటున్నారా..ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో తయారుచేసే పద్ధతిని ఫాలో అయిపోండి...

కావల్సిన పదార్థాలు:

అల్లం (తురిమినది): 1tsp
ఉల్లిపాయ: 1(చిన్నది ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
గ్రీన్ బెల్ పెప్పర్: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి : 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
గుడ్లు -4
పసుపు: 1 చిటికెడు
పావ్ భాజీ మసాలా: 1 + 1tsp
నూనె - 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
బట్టర్: 1tbsp
కొత్తిమీర తరుగు: కొద్దిగా గారిష్ చేయడానికి

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/gfMbzfwm_ME" frameborder="0" allowfullscreen></iframe></center>

తయారుచేయు విధానం:

1. ముందుగా స్టౌమీద కడాయ్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. వేడయ్యాక అందులో అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
2. తర్వాత అందులో పచ్చిమిర్చి మరియు క్యాప్పికమ్ ముక్కలు కూడా వేసి మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
3. తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి, మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
4. ఇవన్నీ వేగే లోపు, ఒక కప్పులో గుడ్డును పగులగొట్టి వేసి అందులో బాగా గిలకొట్టాలి. తర్వాత అందులోనే ఉప్పు, పసుపు, పావ్ భాజీ మసాలా కూడా వేసి బాగా గిలకొట్టాలి.
5. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని కడాయ్ వేగుతున్న మిశ్రమంలో పోయాలి. మొత్తాన్ని వేగిస్తూ అందులో మరికొద్దిగా పావ్ భాజీ మసాలాను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా బటర్ మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి.
6. అంతే ముంబాయ్ స్టైల్ పావ్ భాజీ ఎగ్ బుర్జ్ రెడీ. సర్వ్ చేసే ముందు కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి, సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి అంతే.

English summary

Mumbai Style Egg Bhurji Recipe (Video)

Egg bhurji is a recipe that is well known by every Indian cook. However, there are many versions of this recipe. Egg bhurji or scrambled eggs is an Indian recipe of street food. You can usually get this dish at dhabas and street stalls. You can also m
Desktop Bottom Promotion