For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి

|

ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి ఒక గ్రేట్ పార్టీ ఫుడ్. ఈ కబాబ్ రిసిపి చాలా స్మూత్ గా మరియు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది చికెన్ మలై కబాబ్ రిసిపి ఒక సారి తయారుచేసి, తిన్నట్లైతే ఈ రిసిపిని మనం ఇంతకు ముందే ఎందుకు రుచి చూడలేదు అన్న భావన కలుగుతుంది అంత అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది.

క్రీమ్ బట్టర్ వంటి స్మూతీ ఐటమ్స్ తో తయారుచేయడం వల్ల దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని మసాలదినుసులతో మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపిని నాన్ మరియు సలాడ్స్ తో తీసుకుంటే మంచి కాంబినేషన్ ఫుడ్ . మరి ఈ టేస్టీ నాన్ వెజ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Murg Malai Kabab Recipe

కావలసినపదార్థాలు
ఎముకలు లేని చికెన్: 1/2 kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
వైట్ పెప్పర్ పౌడర్ : 1 tsp
నెయ్యి లేదా వెన్న: పైన బ్రషింగ్ కోసం
మసాలా చాట్: పైన చిలకరించడం కోసం

మ్యారినేషన్ కోసం:
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tbsp
పచ్చి మిర్చి : 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: 1/4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
తాజా క్రీమ్: 2 tbsp
చీజ్ : 1/2cup
బటర్ : తురిమినది
పెరుగు / పెరుగు : 2 tbsp
మెక్కజొన్న/ మొక్కజొన్న గంజి: 4 tbsp
ఉప్పు: రుచికి సరపిడా

తయారుచేయు విధానం:

1. ముందుగా ఒక గిన్నెలో శుభ్రం చేసిన చికెన్ ముక్కలను వేసి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి చికెన్ తో బాగా కలపాలి. కలిపిన తర్వాత 10 మిషాలు పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక గిన్నె లో చీజ్ (జున్ను) వేసి దాన్ని బాగా కలపాలి లేదా మ్యాష్ చేయాలి.

4. ఇప్పుడు ఈ చీజ్ లో మ్యారినేషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని రాత్రంతా అలాగే ఉంచితే టేస్ట్ మరింత బెటర్ గా ఉంటుంది. కనీసం 4,5 గంటలు మ్యారినేట్ చేసి, ఫ్రిజ్ లో ఉంచాలి అప్పుడే చాలా రుచికరంగా ఉంటుంది.

5. కబాబ్ ను తయారుచేయడానికి గంట ముందు ఫ్రిజ్ లో నుండి మ్యారినేట్ చేసిన చికెన్ ను బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత చికెన్ ముక్కలను స్కీవర్స్ కు గుచ్చి లేదా స్టిక్ చేయాలి.

6. అంతలోపు ఓవెన్ బేకింగ్ ట్రేలో సిల్వర్ ఫోయిల్ అమర్చి, ఓవెన్ ను గ్రిల్ మోడ్ ఉంచి 250 డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఫ్రీహీట్ చేయాలి.

7. దీన్ని కనీసం 8నిముషాలు గ్రిల్ చేసి తర్వాత బయటకు తీసి, 8నిముషాలు తిరిగి గ్రిల్ చేయాలి.

8. ఇప్పుడు కొద్దిగా తేనె లేదా బటర్ ను బ్రష్ చేసి, ఛాట్ మసాలా చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ముర్గ్ మలై కబాబ్ రిసిపి రెడీ..

English summary

Murg Malai Kabab Recipe

Murg Malai Kabab is so easy to make you'll wonder why you haven't cooked it before! Here is the recipe of Murg Malai Kabab.
Story first published: Thursday, April 16, 2015, 14:06 [IST]
Desktop Bottom Promotion