Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
వెరీ టేస్టీ మష్రుమ్-చికెన్ రిసిపి
మష్రుమ్ ను వివిధ వెరైటీలుగా వండుతారు. మష్రుమ్ ను వివిధ రకాల మసాలా దినుసులుచేర్చి తయారు చేస్తారు. కొన్ని సందర్బాల్లో వెజిటేబుల్స్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, మరియు టమోటోలతో చేర్చి అద్భుతంగా తయారు చేస్తారు.
వెజిటేరియన్స్ లో మిక్స్ చేసే విధంగానే మష్రుమ్ ను నాన్ వెజిటేరియన్ లో కూడా చేర్చి ఓ కొత్త టేస్ట్ ను రుచి చూడవచ్చు. చికెన్ మష్రుమ్ చాలా రుచికరంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక సారి ట్రై చేసి చూడండి.
కావల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు: 1cup(boneless)
మష్రుమ్(పుట్టగొడుగులు):1cup(quartered)
ఉల్లిపాయ: 1
టమోటో: 1
పచ్చిమిర్చి: 3
వెల్లుల్లి రెబ్బలు: 5
అల్లం: ½ inch
పసుపు: 1tsp
కారం: 2tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
మిరపకాయ: ½tsp
బ్లాక్ పెప్పర్: 4(grounded)
కోకోనట్ క్రీమ్: 2tbsp
నూనె: ½ cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయలను, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిని పేస్ట్ తయారు చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత టమోటోను సపరేట్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, ఉల్లిపాయ పేస్ట్ వేసి, పేస్ట్ పచ్చివాసనపోయేంత వరకూ, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు, వేసి బాగా మిక్స్ చేయాలి. రెండు నిముషాల తర్వాత కారం, ధనియలా పొడి, ఎండు మిర్చి, మరియు బ్లాక్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసి ఐదు నిముషాల పాటు బాగా ఉడికించుకొని తర్వాత చికెన్ ముక్కలను వేసి ఉడికించుకోవాలి.
5. చికెన్ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక అందులోనే విడిపించి శుభ్రం చేసి పెట్టుకొన్ని మష్రుమ్ లను కూడా వేసి బాగా మిక్స్ చేయలి. ఈ మిశ్రమాన్నంతటినీ ఐదునిముషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చివరగా కోకనట్ క్రీమ్ వేసి, అలాగే టమోటో తరగు వేసి మరో రెండు మూడు నిముషాల పాటు గ్రేవీచిక్కబడేలా ఉడికించాలి. అంతే మష్రుమ్ చికెన్ కర్రీ రెడీ. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి అంతే చికెన్ మష్రుమ్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications











