For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోరూరిరంచే మటన్ మటన్ ఇగురు: ఆంధ్రా స్పెషల్

|

మన ఇండియాలో మటన్ కర్రీని వివిధ రకాలుగా వండుతారు. కొన్ని మటన్ వంటలను ప్రత్యేకమైనటువంటి మసాలా దినుసులు ఉపయోగించి తయారుచేస్తారు.

సౌత్ ఇండియన్ వంటల్లో ఎక్కువగా మసాలా దినుసులలతో పాటు కొబ్బరి కూడా ఉపయోగిస్తారు. అయితే మటన్ ఇగురుకు చాలా తక్కువ మసాలా దినుసులు ఉపయోగించి, చిక్కగా అటు ఫ్రై, ఇటు, పులుసు కాకుండా మీడియంగా చపాతీ,దోసె, రైస్ వంటి వాటికి తినేవిధంగా తయారుచేస్తారు. ఇది రంగు, రుచి, మసాలాల యొక్క వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మటన్ ఇగురును ఎలా తయారుచేయాలో చూద్దాం...

Mutton Curry (Iguru): Andhra Special Recipe

కావలసిన దినుసులు:
మటన్: 500grm
నూనె: సరిపడా
అల్లం వెళ్ళుళి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
కారం : 1tsp
ధనియాలా పొడి: 1tbsp
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
పసుపు: చిటికెడు
గరం మసాల : 1tsp
ఉల్లపాయలు : 2
పచ్చికొబ్బరి: 1/2cup
గసగసాలు : 2tsp
కొత్తిమీర: కొంచెం

తయారు చేయువిధానం:
1. మటన్ శుభ్రంగా కడిగి అందులొ పసుపు, ఉప్పు, కారం, కొంచెం నీళ్ళు వేసి కుక్కర్లో ఆరు విజిల్స్ వచ్చెవరకు పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయను తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. గసగసాలు, పచ్చి కొబ్బరి, చెంకా, లవంగాలు, మిక్సీలో వేసి పేస్ట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి, అందులొ నూనె వేసి, వేడెక్కిన తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోవాలి.
4. బాగ వేగిన తరవాత అందులొ అల్లం వెళ్లుళి పేస్టు, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు వేసి బాగ కలిపి వేగనివ్వాలి.
5. రెండు నిమసాలు తరవాత మటన్ వేసుకొని కలుపుకొని అందులొ గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం వేసి బాగ కలిపి మరో ఐదు నిమషాలు ఉడికించి, రుచి చూసుకొని కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! ఎంతో రుచిగా ఉడె మటన్ కర్రీ(ఇగురు) రెడీ.

English summary

Mutton Curry (Iguru): Andhra Special Recipe

The surprising part of this mutton recipe is that not a drop of water is used during the cooking process. The magic taste in the dish flares up from slow cooking and the perfect blend of the spices. Traditionally, a little sugar is added and caramelized to get the beautiful and attractive brown colour of the curry.
Story first published: Saturday, March 15, 2014, 11:59 [IST]
Desktop Bottom Promotion