For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మటన్ పెప్పర్ ఫ్రై: ఆంధ్రా స్పెషల్ రిసిపి

|

ఇండియన్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేరు. ముఖ్యంగా స్పైసీగా ఉండే నాన్ వెజ్ ఫుడ్ ను తినకుండా ఏ మాత్రం రాజీ పడరు. నాన్ వెజిటేరియన్స్, చికెన్, మటన్ కు, ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేడి వాతావరణం, సమ్మర్ లో కొంత మంది చికెన్ కు దూరంగా ఉంటారు.అటువంటి వారు మటన్ వంటల మీద ఎక్కువ ఇష్టపడుతారు. అయితే మటన్ ను చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి.

మటన్ పెప్పర్ ఫ్రై అందరికీ తెలిసినటువంటి ఒక పాపులర్ వంట. అయితే ఆంధ్రా స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రైని ఒక సారి తింటే మాత్రం, ఆ టేస్ట్ ను ఎప్పటికీ విడవరు. స్పైసీగా మరియు టేస్టీ గా ఉండే ఆంధ్రా స్టైల్ మటన్ పెప్పర్ ఫ్రైను కొన్ని ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి మౌత్ వాటరింగ్ టేస్ట్ తో తయారుచేస్తారు. మరి మీరు కూడా ఈ స్పైసీ నాన్ వెజిటేరియన్ డిష్ రుచి చూడాలంటే, తయారుచేసే విధానం తెలుసుకోవాల్సిందే...

Mutton Pepper Fry: Andhra Spl Recipe

కావల్సిన పదార్థాలు:

మటన్: 500grms
పసుపు: 1/2tsp
ఉల్లిపాయలు: 3(చిన్న ముక్కలుగా తరిగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టమోటో: 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
కారం: 1tsp
మిరియాల పొడి: 2tsp
కరివేపాకు 6-7
కొత్తిమీర: 2 కాడలు (సన్నగా తరిగినవి)
సోంపు : 1/2 tsp
మిరియాలు: 1tsp
గసగసాలు: 1/2 tsp
ధనియాలపొడి 1/2 tsp
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: 1 అంగుళం
లవంగాలు 2-4
యాలకులు : 2
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp

తయారుచేయు విధానం:

1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో పసుపు, ఉప్పు మరియు 3 కప్పుల నీళ్ళు పోసి 15నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
2. తర్వాత ఫ్లాట్ గా ఉండే పాన్ స్టౌ మీద పెట్టి అందులో సోంపు, జీలకర్ర, గసగసాలు, బ్లాక్ పెప్పర్, లవంగాలు, మరియు యాలకలు వేసి మరో నిముషం వేగించుకోవాలి.
3. తర్వాత వేగించుకొన్న ఈ పదార్థాలను ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
4. డీప్ బాటమ్ పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
6. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న మటన్ ముక్కలు వేసి నూనె పైకితేలే వరకూ ఫ్రై చేయాలి.
8. తర్వాత అందులో టమోటో, కారం, పొడి చేసుకొన్న మాసాల పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
9. తర్వాత 10నిముషాలు మీడియం మంట మీద వేగిస్తూ గ్రేవీ వేరుపడే వరకూ ఫ్రై చేసుకోవాలి.
10. చివరగా పెప్పర్ పౌడర్ చిలకరించి మరో 5 రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే మటన్ పెప్పర్ ప్రై రెడీ . చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Mutton Pepper Fry: Andhra Spl Recipe

Indians never stop craving for hot and spicy food irrespective of the season. Just imagine, it is the peak of summer and all I can think of is some rich mutton pepper fry. Originally, this is a dhaba style dish that you get on the highways. This particular mutton pepper fry recipe is inspired from the Andhra style of cooking.
Story first published: Thursday, May 22, 2014, 12:24 [IST]
Desktop Bottom Promotion