For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ చికెన్

|

Orange Chicken
కావలసిన పదార్ధాలు:

చికెన్ - 500 grm boneless
ఆరెంజ్ జూస్ - 3 cup
మిరయాల పొడి - 2 tbsp
కారం - 1 tsp
వెల్లుల్లి రెబ్బలు - 8 చిదిమినవి
అల్లం - 2 tsp చిన్నగా కట్ చేసినవి
సోయా సాస్ - 2tbsp
బియ్యపు పిండి - 1/2 cup
మైద - 1/2 cup
బేకింగ్ సోడా - 1/4 tsp
కరివేపాకు - 2 tbsp కట్ చేసినవి
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కావలసినంత

తయారు చేయు విధానము:
1. మొదటగా స్టౌ వెలిగించి ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో శుభ్రపరచిన చికెన్ ముక్కలు, ఉప్పు, మిరయాల పొడి వేసి 10 నిమిషాలు ఉడకబెట్టాలి.
2. గిన్నెలో బియ్యపు పిండి, మైదా, కారం, బేకింగ్ పౌడర్, ఉప్పు, కొద్దిగా నీరు పోసి మీడయంగా కలుపుకొవాలి అందులో ఉడికించిన చికెన్ ముక్కలను వేసి కొద్ది మంట మీద డీప్ ప్రై చేయాలి.
3. స్టౌవ్ మరో పక్క పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక మధ్యస్థంగా దంచి పెట్టుకొన్న మిరియాలు, చిదిమిన ఉల్లిపాయలు, కట్ చేసిన అల్లం ముక్కలు అందులో వేసి ప్రై చేయాలి.
4. గుమ గుమ వాసన వచ్చే సమయంలో అందులో సోయా సాస్ మరయు ఆరెంజ్ జూస్ వేసి బాగా కలియదిప్పాలి. ఇప్పుడు అందులో వ్రై చేసి పెట్టుకొన్న చికెన్, ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా ప్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
5. స్టౌ మీద నుండి దించాక కొద్దిసేపటికి బాగా ఇమిరి ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా ఆరెంజ్ జూస్ ను వేసి బాగా కలిపితే మంచి రంగు, వాసనలతో గుమ గుమ లాడుతుంది అప్పుడు సర్వ్ చేయవచ్చు.

Story first published:Wednesday, November 18, 2009, 12:05 [IST]
Desktop Bottom Promotion