For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ చికెన్ : సైడ్ డిష్ స్పెషల్ రిసిపి

|

గ్రీన్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉండే సీజన్ ఇది . ముఖ్యంగా మీరు లెట్యూస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ మరియు వివిధ రకాల ఆకుకూరలు మనకు ఎక్కువగా కనబడుతుంటాయి. ఆకుకూరల్లో మరింత ఆరోగ్యకరమైనది పాలకూర. పాలకూరతో వివిధ రకాల వంటలను వండుతారు.

పాలకూరలలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పాలకూరలో అనే న్యూట్రీషినల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మాంసాహార ప్రియులైతే. అప్పుడు పాలకూర మరియు చికెన్ మీ టేస్ట్ బడ్స్ ను ట్రీట్ చేస్తుంది. పాలక్ చికెన్ ఒక నోరూరించే హెల్తీ డిష్. అలాగే అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ నోరూరించే పాలక్ చికెన్ రిసిపిని మీరూ టేస్ట్ చూడాలంటే తయారుచేసే పద్దతి తెలుసుకోవాల్సిందే...

Palak Chicken: Side Dish Recipe Special

కావల్సిన పదార్థాలు:
చికెన్: 250gms (నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి)
పాలక్-500 gms (ఉడికించినది)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉల్లిపాయ: 2
పెరుగు 1tbsp
పచ్చిమిర్చి: 3-4
పసుపు: 1tsp
ధనియాల పొడి: 1tsp
పంచదార: చిటికెడు
నిమ్మరసం: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
జీలకర్ర: 1tsp
బే ఆకు 1
ఫ్రెష్ క్రీమ్: 1tsp (garnishing కోసం)

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
2. అంతలోపు పాలకూరను విడిపించి శుభ్రంగా కడిగి, పచ్చిమిర్చి, ఆకూకూరను ఉడికించి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. అలాగే ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి, నూనె వేసి, వేడి చేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, మరియు బిర్యానీ ఆకును వేసి ఒక నిముషం వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి .
6. ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసి మరో మరో 5నిముషాలు వేయిచుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసి మిక్స్ చేస్తూ వేయించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేసి, మూత పెట్టి తక్కువ మంట మీద 20 నుండి 25నిముషాలు పాటు ఉడికించుకోవాలి .
8. ఇప్పుడు పెరుగులో కొద్దిగా పందరా మిక్స్ చేసి, ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో ఉప్పు, ధనియాలపొడి వేసి మిక్స్ చేస్తూ అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. గ్రేవీ బాగా చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
10. పాలక్ చికెన్ గ్రేవి చిక్కగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేయాలి.

English summary

Palak Chicken: Side Dish Recipe Special

It is the best season to enjoy numerous green vegetables to the fullest. You will find lettuce, cabbage, cauliflower and the loved spinach in this season. Spinach which is commonly called palak in India is used in many side dishes.
Desktop Bottom Promotion