For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలక్ - మటన్‌ మసాలా

|

పాలక్ మటన్ మసాలా చాలా పాపులర్ అయినటువంటి డిష్. ఈ డిష్ ఇండియాలో అన్ని ప్రదేశాల్లో చాలా పాపులర్ అయినటుంటి రిసిపి. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లో ఇది చాలా ఫేమస్ అయినటువంటి డిష్ ముఖ్యంగా పంజాబ్ మరియు పాకిస్తాన్ ముఘులాయ్ డిష్ ల నుండి పాలక్ మటన్ డిష్ పరిచయం చేయబడింది.

పాలక్ మటన్ అంటే ఆకుకూరల్లో ఒకటైన పాలకూరతో మరియు కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో దీన్ని తయారుచేస్తారు. చాలా సింపుల్ గా మరియు ఈజీగా ఈ డిష్ ను తయారుచేయవచ్చు . మసాలా దినుసులు ఘుమఘుమలాడే ఫ్లేవర్ ను అందిస్తుంది. పాలక్ అండ్ మటన్ కాంబినేషన్ డిష్ నాన్, రోటీ, చపాతీ మరియు రైస్ మంచి కాంబినేషన్ డిష్. చాలా సింపుల్ గా తయారుచేసే ఈ పాలక్ మటన్ ఏ సమయంలో అయినా తయారుచేసుకోవచ్చు.

Palak Mutton Masala

కావలసిన పదార్థాలు:
మటన్‌ : 500grm
ఉల్లిపాయలు : 50grm
టమోటో: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి : 2tsp
కారం : 2tsp
సోంపుపొడి : 5grm
ఎండు మెతికూర : 5grm
గరం మసాలా : చిటికెడు
పాలకూర : 2 లేదా 3కట్టలు
రిఫైన్డ్‌ ఆయిల్‌ : 50grm
కొబ్బరి మసాలా : 25grm
పసుపు : 1/2tsp
జీలకర్ర : 5 grm
ఉప్పు : రుచికి తగినంత
గరం మసాలా : చిటికెడు

తయారుచేసే విధానం:
1. ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరుగుతుండగా... శుభ్రంచేసిన పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికించండి.
2. ఆ తర్వాత క్రిందికి దింపుకొని, నీరు వంపేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించండి.
4. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ టమోటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకూ మెత్తగా వేగించుకోవాలి.
5. తర్వాత మటన్ ముక్కలను వేసి 10-15నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
6. మటన్‌ మెత్తబడిన తరువాత కొబ్బరి మసాలా ముద్దను వేసి పూర్తిగా ఉడికించండి.
7. ఆ తర్వాత పాలకూర పేస్టు, జీలకర్ర, సోంపుపొడి, గరం మసాలా, ఎండు మెంతికూర పొడివేసి కలియబెట్టి మూత కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి మూత పెట్టి 10-15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి అంతే... పాలక్‌ మటన్ మసాలా రెడీ!

English summary

Palak Mutton Masala

Palak Gosht is a very popular dish and almost known in every part of the Indian Subcontinent. This dish is especially preferred in the Northern parts of India & Punjab of Pakistan where the Mughals had left an enduring influence in the South Asian cuisine.
Story first published: Friday, June 20, 2014, 12:48 [IST]
Desktop Bottom Promotion