For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పైనాపిల్ చికెన్ : స్వీట్ అండ్ సోర్ రిసిపి-క్రిస్మస్ స్పెషల్

|

పైనాపిల్ చికెన్ స్వీట్ అండ్ సోర్ మీట్ రిసిపి. చాలా మంది ఈ రిసిపి చాలా రుచిగా ఉంటుందని భావిస్తారు. ఈ రుచికకరమైన పైనాపిల్ చిక్ రిసిపి చాలా టేస్టీగా మరియు కడుపు నింపే విధంగా ఉంటుంది.

ఈ పైనాపిల్ చికెన్ రిసిపిని రైస్ లేదా చపాతీలకు ఒక చక్కటి కాంబినేషన్. ఇది ఆకలిని పెంచేసే ఒక అద్భుతమైన నాన్ వెజిటేరియన్ రిసిపి. ఈ చికెన్ రిసిపిన చాలా సింపుల్ కాంబినేషన్ చికెన్ మరియు పైనాపిల్. చికెన్ లవర్స్ కోసం ఈ స్వీట్ అండ్ సోర్ టేస్ట్ ను ఎంపిక చేసుకోబడింది. ఈ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలి చూద్దాం...

Pineapple Chicken: Sweet And Sour Recipe
కావల్సిన పదార్థాలు:
చికెన్ బాల్స్ కోసం
చికెన్ : 500g(బోన్ లెస్ మీడియం సైజ్ ముక్కలు)
పైనాపిల్ స్లైస్ 8-10
సోయాసాస్: 2tbsp
వైన్: 5tbsp
బ్లాక్ పెప్పర్: 2tbsp
చికెన్ కోసం
కార్న్ ఫ్లోర్ -3tbsp
గుడ్లు: 5-6
మైదా: 5tbsp
వేరుశెనగ నూనె: 3-4tbsp
ఉప్పు: రుచికి సరిపడా
సాస్ కోసం:
టమోటో సాస్: 2tbsp
వెనిగర్: 1tbsp
షుగర్: 1tbsp
కార్న్ ఫ్లోర్: 11/2tbsp

తయారుచేయు విధానం :
1.ముందుగా చికెన్ ను ఒక పెద్దగిన్నెలో తీసుకొని తర్వాత అందులో సోయాసాస్, వైన్, కార్న్ ఫ్లోర్, బ్లాక్ పెప్పర్ మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి 30-45నిముషాలు మ్యారినేట్ చేయాలి.
2. తర్వాత మరో మీడియం సైజ్ బౌల్లో గుడ్డు పగులగొట్టి వేసి అందులో మైదా వేసి, బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మ్యారినేట్ చికెన్ తీసుకిని మైదా మిక్సర్ లో డిప్ చేయాలి. తర్వాత అందులో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, అందులో వేరుశెనగ నూనె వేయాలి.
5. నూనె వేడయ్యాక అందులో డిప్ చేసిన చికెన్ ముక్కలు అందులో వేసి, మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
6. బ్రౌన్ కలర్ లోకి మారగానే పక్కకు తీసి పెట్టుకోవాలి.

సాస్ కోసం :
1. మరో ఫ్రైయింగ్ పాన్ తీసుకొని, గ్యాస్ మీద పెట్టి అందులో టమోటో సాస్, వెనిగర్, పంచదార మరియు కార్న్ ఫ్లోర్ వేయాలి .
2. ఈ మొత్తం మిశ్రమాన్ని రెండు మూడు నిముషాలు బాగా ఉడికించుకోవాలి
3. సాస్ చిక్కగా మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

సర్వింగ్ కోసం
1. చికెన్ ముక్కలకు, పైనాపిల్ ముక్కలకు టూత్ పిక్ ను స్టిక్ చేయాలి. ఇలాగే మిగిలిన అన్ని చికెన్ ముక్కలకు మరియు పైనాపిల్ ముక్కలను పూర్తిగా ఇలా టూత్ పిక్స్ స్టిక్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు, వాటిని మొత్తం ప్లేట్ లో సర్ధి, తర్వాత వాటి మీద సాస్ ను పోయాలి.
3. అంతే, సర్వ్ చేయడానికి పైనాపిల్ చికెన్ రెడీ. ఈ బోన్ లెస్ చికెన్ రిసిపి పైనాపిల్ చికెన్, నాన్ వెజిటేరియన్ కొరకు ఒక అద్భుతమైన రుచికలిగినటువంటి వంట. ఈ చికెన్ రిసిపిని ఇంట్లో తయారుచేయడానికి ప్రయత్నించండి...

English summary

Pineapple Chicken: Sweet And Sour Recipe


 Pineapple Chicken is a sweet and sour meat recipe. Many people would simply love to relish this chicken recipe as it has a savoury taste.
Story first published: Monday, December 23, 2013, 12:06 [IST]
Desktop Bottom Promotion