For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాన్ కబాబ్ రిసిపి: ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

ప్రాన్ కాబాబ్స్ అంత విరివిగా తయారు చేసుకొనే వంటకం కాదు. కానీ మీరు గ్రిల్డ్ ప్రాన్స్, లేదా తందూరి ప్రాన్స్ వినే ఉంటారు. అయితే ప్రాన్ కబాబ్ కాన్సప్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా తయారు చేయడంలో చాలా ఉత్సాహం ఉంటుంది. దాంతో పాటు కొత్తరుచిని వెంటనే చూడాలని ఆత్రుత కూడా ఉంటుంది. ఈ వింటర్ సీజన్ లో అటువంటి కొత్త రుచి ఒకటి మీరు ప్రయత్నిస్తే బాగుంటుందనుకొనే వారికి మాంసంకు బదులుగా ప్రాన్స్ ను ఉపయోగించుకోవచ్చు.

అంత అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది . మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాన్ కబాబ్ రిసిపి ఎలా తయారుచేయాలో తెలుసుకొని వెంటనే ప్రారంభించండి. ఈ సలాడ్ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే ప్రాన్ కాంబినేషన్ లో తయారు చేస్తే కొత్త రుచి ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలంటే ఈ రిసిపిని ప్రయత్నించాల్సిందే...

Prawn Kebabs For Evening Snack Recipe

కావలసిన పదార్థాలు:
పెద్ద రొయ్యలు - 1/2kg

మొదటి సారి మ్యారినేషన్ కోసం:
ఉల్లిపాయ గుజ్జు -150grm
చింతపండు గుజ్జు- 50grm
పసుపు - 1tsp
ఉప్పు- రుచికి సరిపడా

రెండోసారి మ్యారినేషన్ కోసం:
కారం - 50 grm
ధనియాల పొడి - 100 grm
జీలకర్ర పొడి - 75 grm
మిరియాల పొడి - 50 grm
కొబ్బరి తురుము- 50 grm
నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.

మూడోసారి మ్యారినేషన్ కోసం:
ఉల్లిపాయ గుజ్జు - 100 grm
చింతపండు గుజ్జు - 100 grm
కారం - 1 tbsp

తయారుచేసే విధానం:
1. ముందుగా రొయ్యల్ని శుభ్రం చేశాక మొదటిసారి పదార్థాలన్నీ కలిపి అందులోనే రొయ్యల్నివేసి బాగా కలిపి 2 గంటలపాటు ఉంచాలి.
2. రెండోసారి కలిపే పదార్థాలను నేతిలో వేగించి అందులోనే మూడోసారి కలిపే పదార్థాలను కూడా వేసి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి.
3. ఇలా రెడీ చేసి పెట్టుకొన్న పేస్ట్ ను రొయ్యలికి మ్యారినేట్ చేసి 3 గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
4. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న రొయ్యలకు తీసి సన్నని షీకర్స్ కు గుచ్చి ఓవెన్ టో పెట్టి బేక్ చేసుకోవాలి. గ్యాస్‌ స్టౌవ్‌పైన కూడా కాల్చుకోవచ్చు.
5. వీటిని వైట్ ప్లెయిన్ రైస్ కు సైడ్ డిష్ గా వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Prawn Kebabs For Evening Snack Recipe

Prawn Kebabs For Evening Snack Recipe. Today we will be sharing the recipe for preparing chilli garlic prawn kebabs. The name chilli garlic prawns may seem slightly oriental to you, but this kebab recipe is one hundred percent Indian. We will prepare the chilli garlic prawn kebabs with Indian spices. The recipe is simple enough and the ingredients are very basic. It is everything that you expect from a proper Ramzan recipe.
Story first published: Monday, September 21, 2015, 17:15 [IST]
Desktop Bottom Promotion