For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాన్స్-గ్రీన్ చిల్లి మంచూరియా

|

Prawns-Green Chilli Manchurian
వంటకాల్లో నోరూరించే రొయ్య. నాన్ వెజ్ లో చికెన్ తరువాత చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు. వీటితోచేసే ఏ వంటకమైన సరే వాటికి దాసోహమే. ప్రాన్స్ మంచురియా చికెన్, గోబీ మంచూరియాల కంటే చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి...

కావలసిన పదార్థాలు:
ప్రాన్స్: 1/2kg
అజినమోటో: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 2tbsp
కోడిగుడ్లు: 2
కార్న్‌ ఫ్లోర్(మొక్కజొన్న పిండి): 1cup
మైదాపిండి: 1cup
నూనె: తగినంత
పచ్చిమిర్చితరుగు: 6-10
అల్లం, వెల్లుల్లి తరుగు: 1/2cup
ఉల్లిపాయలు: 2
పసుపు: చిటికెడు
కారం: 2tbsp
కొత్తిమీర తరుగు: 1cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్‌ ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో అజినమోటో, ఉప్పు, మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి.
3. ఇప్పుడు పాన్‌ లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్నిఒక్కొక్కటే పకోడీల్లా వేసుకుని బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయతరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, కొద్దిగా అజినమోటో, మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి.
5. ఫైనల్ గా ముందే వేయించి పెట్టుకున్న ప్రాన్స్ పకోడీలను కూడా అందులో వేసి కలిపి తక్కువ సెగ మీద పది నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్‌ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ..

English summary

Prawns-Green Chilli Manchurian | ప్రాన్స్-గ్రీన్ చిల్లి మంచూరియా

Prawn Manchurian. Very, very indian style of Chinese cooking ! Fish or prawns cooked with green chillies, fresh coriander, onions, ginger and garlic.
Story first published:Wednesday, March 14, 2012, 18:15 [IST]
Desktop Bottom Promotion