Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
పుదీనా మటన్ బిర్యానీ

కావలసిన పదార్థాలు:
పుదీన ఆకులు: 4cups
ఉల్లిపాయలు ముక్కలు: 1/2cup
నిమ్మకాయలు: 2
ఉప్పు : రుచికి సరిపడినంత
ఫుడ్ కలర్: చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
గరం మసాలా: 1tsp
యాలకులు: 4
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
బాస్మతి రైస్: 3cups(ఆఫ్ బాయిల్డ్ చేసినది)
ధనియాలపొడి: 1/2tsp
నూనె : తగినంత
బిర్యానీ మసాలా: 1tsp
తయారు చేయు విధానం:
1. కుక్కర్ లో మటన్ ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, పెరుగు, బిర్యానీ మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి డీప్ ఫ్రిజ్ లో అరగంట పెట్టాలి. ఇలా చేస్తే మసాలా మొత్తం మటన్ కి పడుతుంది. 3. ఇప్పుడు ఒక గిన్నె లో కొద్దిగా నూనె వేసి అందులో చెక్కలవంగం, యాలకులు బిర్యాని ఆకు వేయించి తర్వాత బియ్యం, నీళ్ళు పోసి రైస్ ను ఆఫ్ బాయిల్ చేసి విడిగా పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి వేడయ్యాక మటన్ ముక్కలను ఒక పొరగా పరచి, దానిపైన వేయించి పెట్టుకొన్న ఉల్లిపాయల తరుగు పొర, దాని పైన పుదీనా తరుగు, ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్, తర్వాత మటన్, ఆ పైన ఉల్లిపాయలు, ఆ పైన పుదీనా, కొత్తిమీర ఆ పైన ఆఫ్ బాయిల్డ్ రైస్ తో... పూర్తిగా సర్దాలి.
5. తర్వాత ఫుడ్ కలర్ ని ఒక టీ స్పూన్ నీళ్లలో కలిపి పైన చిలకరించాలి. పైన మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా గోధుమ పిండి ముద్దతో గిన్నెను, మూతను కలిపి కవర్ చేయాలి. తర్వాత సన్నని మంటమీద ఇరవై నిమిషాలు ఉడికించి, దించేయాలి అంతే పుదీనా మటన్ బిర్యాని రెడీ.



Click it and Unblock the Notifications