For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొటాటో మటన్ కర్రీ: నాన్ వెజ్ స్పెషల్

|

సాధారణంగా ఆంధ్రా వంటలంటే చాలా స్పైసీగా ఉంటాయి. స్పైసీ లేకుండా ఆంధ్రావంటలు ఉండవంటే అతిశయోక్తికాదేమో..ఆ వంటకాల్లో ఈ మటన్ కర్రీ కూడా ఒకటి. ఈ మటన్ కర్రీలో వివిధ రకాల మసాలా దినుసులు అందులోనూ వివిధ ఫ్లేవర్స్ ఉన్న మసాల దినుసులు ఉపయోగించడం వల్ల ఈ మటన్ కర్రీ మరింత స్పైసీగా ఘుమఘుమలాడుతూ స్పైసీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీ తయారు చేసే ముందుగానే మటన్ ను కుక్కర్ లో ఉడికించుకోవాలి. అప్పుడు గ్రేవీ చిక్కగా తయారవుతుంది. అంతే కాదు, మటన్ కర్రీకి బంగాళదుంప చేర్చడం వల్ల మరింత టేస్టీగా, గ్రేవీ చిక్కగా ఉంటుంది.

READ MORE: చెట్టినాడ్ మటన్ కర్రీ : పాపులర్ రిసిపి

ఈ ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. ఇది తయారు చేయడానికి మటన్ సపరేట్ గా మసాలా దినుసుల గ్రేవీ వేరుగా ఉడికించుకోవడంలోనే ట్రిక్ దాగివుంది. మరి ఇంకెదుకు ఆలస్యం ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ తయారు చేసేయండి.....

Simple Potato Mutton Curry : Telugu Vantalu

కావలసిన పదార్థాలు:
బంగాళదుంప: 2(పొట్టతీసి కట్ చేసుకోవాలి)
మటన్: 1kg
ఉల్లిపాయ: 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చెక్క: చిన్న ముక్క
యాలకులు: 4-5
బిర్యాని ఆకు: 2
పచ్చిమిర్చి: 4-5
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 4tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టమోటో :4-5(గుజ్జులా తయారు చేసుకోవాలి)
కారం: 1tsp
ధనియా పౌడర్: 11/2 tbsp
గరం మసాలా పౌడర్: 1 1/2 tsp

READ MORE: గోంగూర మటన్ కర్రీ రిసిపి: ఆంధ్రా స్టైల్

తయారు చేయు విధానం:

1. ముందుగా ఉల్లిపాయల ముక్కలు, మటన్ పీసెస్స్, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యాని ఆకులు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఒక కప్పు నీళ్లు ప్రెజర్ కుక్కర్లో వేసి మూత పెట్టి 25-30నిమిషాల పాటు

ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత కడాయిలో నూనె వేసి కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే టమోటో గుజ్జ వేసి మరో రెండు నిమిసాలు వేయించాలి.
3. ఇప్పుడు అందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా అంతా వేగుతూ నూనె పైకి తేలుతుంది అప్పుడు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంప వేసి బాగా

కలపాలి.
4. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న మటన్ మిశ్రమాన్ని కడాయిలోకి వంచుకోవాలి. ఈ మొత్త మిశ్రమాన్ని మరో పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నీళ్ళు

కావాలనుకొంటే కొద్దిగా పోసుకొని బంగాళదుంప మొత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
5. అందులోనే రుచికి తగినంత ఉప్పు, మరికొంచె గరం మసాలా, బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించి, సర్వింగ్ బౌల్ లోనికి తీసుకొని హాట్ హాట్ గా రైస్, చపాతి లేదా రోటీ లతో సర్వ్

చేయాలి . అంతే ఆలూ మటన్ రెడీ.

English summary

Simple Potato Mutton Curry : Telugu Vantalu

Simple Potato Mutton Curry : Telugu Vantalu, Do you know how to prepare potato mutton curry at home easily? Check out and give it a try....
Story first published: Saturday, July 11, 2015, 16:26 [IST]
Desktop Bottom Promotion