For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ కడై మటన్ గ్రేవీ రిసిపి: రంజాన్ స్పెషల్

|

రంజాన్ సెలబ్రేట్ చేసుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. రంజాన్ స్పెషల్ గా వివిధ రకాల ఫ్లేవర్, టేస్ట్ తో వెరైటీ నాన్ వెజ్ వంటలను రుచి చూడవచ్చు.

రంజాన్ కు ఇంట్లో వారితో పాటు, అతిథులను అద్భుతమైన రుచులను పరిచయం చేసే వంటల్లో కడై మటన్ గ్రేవీ ఒకటి.పేరు వింటేనే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఈ గ్రేవీ చిక్కగా మరియు టేస్టీగా ఉంటుంది . ఇది రోటీ లేదా రైస్ కు అద్భుతంగా ఉంటుంది.

ఈ రిసిపి సౌత్ ఇండియన్ ట్రెడిషినల్ రిసిపి . మరి దీన్ని ఎలా తయారుచేయాలి. ఎటువంటి పదార్థాలు అవసరం అవుతాయో చూద్దాం..

Special Kadai Mutton Gravy For Ramzan

కావల్సిన పదార్థాలు:
మటన్ - 750 g
ఉల్లిపాయలు- 2 cups
టమోటోలు - 1 cup
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 teaspoon
పచ్చిమిర్చి - 6 to 8
కారం - 1/2 teaspoon
గరం మసాలా - 1/2 teaspoon
మీట్ మసాలా పౌడర్ - 1/2 teaspoon
ధనియాల పొడి - 1/2 teaspoon
పసుపు - 1/2 teaspoon
కస్తూరి మేతి - 1/2 teaspoon
కొత్తిమీర- 1/2 cup
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో మటన్ , కొద్దిగా పసుపు వేయాలి.
2. తర్వాత అందులో నీళ్ళు సోసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. కుక్కర్ లో ప్రెజర్ తగ్గిసన తర్వాత , పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
4. కాగే నూనెలో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.
5. 5 నిముషాల తర్వాత ఉల్లిపాయలు, టమోటోలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, మరియు కారం వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
6. తర్వాత అందులో సరిపడా నీళ్ళు పోయాలి. ఇప్పుడు అందులో కస్తూరి మేతీ , మీట్ మసాలా పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
7. 15 నిముషాలు ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిస్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే కడై మటన్ గ్రేవీ రిసిపి రెడీ. . ఈ స్పెషల్ మటన్ గ్రేవీ
రిసిపి రంజాన్ స్పెషల్ వంట.

English summary

Special Kadai Mutton Gravy For Ramzan

Ramzan is that time of the year where you can taste the different flavours of many varieties of food. Each day you can feast on some of the amazing recipes. Among which non-vegetarian recipes are preferred the most, as it is believed that these recipes will have more nutrients that give you the stamina for an entire day.
Story first published:Friday, July 1, 2016, 14:46 [IST]
Desktop Bottom Promotion