For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పెషల్ ఖీమా సమోసా : రంజాన్ స్పెషల్

By Super Admin
|

రంజాన్ నెల ప్రారంభమైందంటే చాలు,సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్షలు చేస్తారు ముస్లీములు. సూర్యస్తమయంలో ఉపవాసం బ్రేక్ చేసే సమయంలో అద్భుతమైన రుచులు కోరుకుంటారు . రోజంతా ఉపవాసం ఉండే వారు, మీ మనస్సులో మొదట వచ్చేదేమి. మీరు ఖచ్చితంగా బిర్యానీ మీద కాదు.

మీరు నిజంగా ఒక క్రంచీ కబాబ్ లేదా యమ్నీ స్నాక్స్ నుతినడానికి ఇష్టపడుతారు. రంజాన్ రిసిపిలలో ఒక ఉత్తమ వంటలు ఎప్పుడూ ఫ్రైడ్ లేదా స్పైసీ వంటలే. మీరు రోజంతా ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, ఎక్కువగా తినకూడదని గుర్తుంచుకోవాలి.

రంజాన్ కు వివిధ రకాల వంటలు వండుతారు, వాటిలో ఒకటి ఖీమా వంటలు, ఖీమాతో సమోసా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని స్నాక్ గా కూడా తీసుకుంటారు. ఇంట్లో సహజంగా ఉపయోగించే పదార్థాలతోటే ఈ సమోసాను తయారుచేసుకోవచ్చు. మీరు మటన్ కు బదులు, చికెన్ కూడా ఉపయోగించవచ్చు .

ట్రెడిషినల్ మరియు ఆథెంటిక్ ఖీమా సమోరిసిపిని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయడానికి రంజాన్ మాసం ఒక బెస్ట్ సమయం. మరి ఈ క్విక్ రంజాన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Special Kheema Samosa For Ramzan

కావల్సిన పదార్థాలు:

కవరింగ్ కోసం:
మైదా- 2 cups
బట్టర్ - 2 tablespoons
ఉప్పు - According to taste
పెరుగు - 1½ tablespoon
నీళ్ళు : కలుపుకోవడానికి సరిపడా


స్టఫింగ్ కొరకు
మటన్ లేదా చికెన్ ఖీమా - 500 grams
నూనె- 2½ tablespoons
సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు - 2
సన్నగా తరిగిన అల్లం- 2 tablespoons
సన్నగా తరిగిన - 2½ tablespoons
కొత్తిమీర తరుగు – కొద్దిగా
పుదీనా (అసరమనుకుంటే) - 2 tablespoons
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2
స్ప్రింగ్ ఆనియన్స్ - 2½ tablespoons
పసుపు - ¼th teaspoon
కారం - 1 teaspoon
జీకలర్ర పొడి- 1 teaspoon
గరం మసాలా పౌడర్ - ½ teaspoon
మటన్ స్టాక్ - 1 cup
నూనె డీప్ ఫ్రై చేయడానికి
ఉప్పు రుచికి తగినంత
పంచదరా - చిటెకెడు

తయారీ:

పిండి తయారీ:

1. ముందుగా మైదా , సాల్ట్ తీసుకుని మిక్స్ చేయాలి
2.అందులో బటర్ చుంక్సు వేయాలి
3. పెరుగు వేయాలి
4. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. తర్వాత నీళ్ళు పోసి మెత్తగా పిండిని కలపాలి .
5. నీళ్ళు ఎక్కువగా పోయకుండా, సరిపడా పోసి, పిండిని సాప్ట్ గా స్మూత్ గా కలిపి పెట్టుకోవాలి.
6.తర్వాత ఒక క్లీన్ గా ఉండే తడిబట్టను పిండిమీద కప్పి ఉంచాలి. దాదాపు అరగంట అలాగే ఉండనివ్వాలి.

స్టఫింగ్ కోసం
1. ఖీమాను శుభ్రంగా కడిగి నీరు మొత్తం పూర్తిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి వేగించాలి.
3. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో మెత్తబడేవరకూ వేగించుకోవాలి.
4. ఇప్పుడు, అందులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి 15నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న ఖీమా, ఉప్పు కూడా వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు సరిచూసుకుని వేయాలి. ముందు పిండిలో కూడా జోడించడం వల్ల స్టఫింగ్ లో తక్కువ వేసుకుంటే సరిపోతుంది.
6. ఖీమా మెత్తగా వేగిన తర్వాత అందులోనే కారం, పసుపు, మరియు జీలకర్ర వేయాలి.
7. ఇప్పుడు మొత్తం మిశ్రమం మిక్స్ చేయాలి. తర్వాత షుగర్ జోడించాలి.
8. తర్వాత మటన్ లేదా చికెన్ స్టాక్ ను పోయాలి. తక్కువ మంటలో ఉండికించాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల బాగామెత్తగా , త్వరగా ఉడుకుతుంది.
9. మద్యలో మూత తీసి చూడటం వల్ల మటన్ నుండి ఆయిల్ విడిపోయనట్లు, డ్రైగా ఉడుకుతున్నట్లు గమనించాలి. ఇలా ఉడికేటప్పుడు, గరం మసాలా జోడించి ఒక నిముషం ఫ్రై చేసుకుని స్టౌ మీద నుండి క్రిందికి దింపుకోవాలి.


10. కొత్తిమీర, పుదీనా ఆకులను మరియు స్ప్రింగ్ ఆనియన్స్ ను కూడా చల్లులకోవాలి.

11. మొత్తం మిశ్రం మరో సారి మిక్స్ చేసి స్టఫింగ్ కు సిద్దం చేసుకోవాలి.

సమోసా కొరకు

1. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దిగా తీసుకుని, చిన్న చిన్న ఉండలు చేసి, చాపాతీల్లా రోల్ చేసుకోవాలి .

2. చపాతీలా రుద్దుకున్న తర్వాత మద్యలోకి కట్ చేసి , ఒకదాన్ని కోన్ షేప్ లో మడత పెట్టాలి.

3. ఈ కోన్ షేస్ లో ముందుగా స్టఫింగ్ కోసం సిద్దం చేసుకున్న మిశ్రమాన్ని పెట్టాలి .

4. తర్వాత అన్ని వైపులా క్లోజ్ చేయాలి.

5. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న సమోసాలను 30 నిముషాలు రిఫ్రిజరేటర్ లో స్టోర్ చేయాలి.

6. అరగంట తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి , కాగిన తర్వాత సమోసాలను ఒక్కటి రెండు కాగే నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

7. డీఫ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడానికి పేపర్ టవల్ మీద వేయాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకుని, మీకు నచ్చిన ఫేవరెట్ సాస్ తో వండించాలి. అంతే రంజాన్ స్పెషల్ ఖామా సమోసా రెడీ. టమోటోసాస్, మింట్ చట్నీ మరియు పెరుగు బెస్ట్ కాంబినేషన్.

English summary

Special Kheema Samosa For Ramzan

Are you throwing an 'Iftar’ party after the whole day fast during Ramzan? After all, celebrating the dinner with your friends and family has special a charm, right?If you want to try a simple, yet delicious, recipe, then try the special kheema samosa recipe for Ramzan.Making kheema samosa for Ramzan is easy and the crispy snack after the whole day fast will definitely give you a heavenly taste. Also, kids will love to have it, as they are fond of snacks.
Desktop Bottom Promotion