For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చికెన్ స్టిక్ రిసిపి: ఇఫ్తార్ పార్టీ స్పెషల్

|

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల..అత్యంత భక్తి శ్రద్దలతో నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు..సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు..ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కనిపించరు. రోజువారీ విధుల్ని మా మూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ..ట్రాఫిక్ లో మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవినం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు.

ఎదుటి వారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటి వారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్ కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు. రంజాన్ మాసంలో భక్తితో ఆచరించే ఉపవాసదీక్షలు విరమించే ఇఫ్తార్‌లో, ఆ తరువాత స్వీకరించే పదార్థాలు నోరూరిస్తాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండే ఈ పదార్థాలకు రంజాన్ నెలలో ప్రత్యేక స్థానం ఉంది. జిహ్వ చాపల్యం కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని రుచి చూడకుండా ఉండలేరు.

రంజాన్ మాసంలో, ఇప్తార్ కోసం డిఫరెంట్ గా వంటలు చేయడం చాలా కొద్దిగా కష్టమైన పనే. అతి కొద్ది సమయంలో టేస్ట్ గా మరియు హెల్తీగా తయారుచేసుకోవాలి . అందుకోసం ఒక హెల్తీ డిష్, టేస్టీ డిష్ ను మీకోసం ఈ రోజు పరిచయం చేస్తున్నాము . చాలా తక్కువ సమయంలో ఈ స్నాక్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. స్పైసీ చికెన్ స్టిక్ రిసిపి చాలా రుచికరంగా ఉంటుంది. పూర్తి పోషకాలను కలిగి ఉంటుంది. టేస్టీ చికెన్ స్టిక్ ,టేస్టీ ఈవెనింగ్ స్నాక్ . అంతే కాదు ఇఫ్తార్ స్నాక్ కూడా.. ముఖ్యంగా రంజాన్ నెలలో ఇఫ్తార్ కోసం వీటిని తీసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

 Spicy Chicken Sticks Recipe For Iftar Party

కావల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు - 500 g
గరం మసాల - 1 teaspoon
క్రీమ్- 1 cup
పచ్చిమిర్చి - 5 to 6
వెల్లుల్లి పేస్ట్ -1/2 teaspoon
కార్న్ ఫ్లోర్ - 1 Cup
ఇంగువ - 1/4th teaspoon కంటే తక్కువ
ధనియాల పొడి - 1/2 teaspoon
జీలకర్రపొడి - 1/2 teaspoon
కారం - 1/2 teaspoon
నిమ్మరసం - 1/2 teaspoon
బ్రెడ్ పొడి
ఉప్పు
నూనె

తయారుచేయు విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జీలకర్ర, దనియాల పొడి, కారం, వెల్లుల్లి పేస్ట్ మరియు కార్న్ ప్లోర్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
2. తర్వాత మరో బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలను వేయాలి. అలాగే ముందు మిక్స్ చేసిన పదార్థాలన్నీ కూడా వేసి మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు సన్నగా తరిగిని పచ్చిమిర్చి, నిమ్మరసం కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
4. అలాగే అందులో క్రీమ్ కూడా వేసి మొత్తం మిశ్రమం మిక్స్ అయ్యేలా చేసిన పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి, నూనె వెడి అయ్యాక అందులో చికెన్ పీసెస్ ను బ్రెడ్ పొడిలో రోల్ చేసి తర్వాత కాగే నూనెలో వేసి డీఫ్ ప్రై చేసుకోవాలి.
6. చికెన్ స్టిక్స్ క్రిస్పీగా, బ్రౌన్ కలర్లో ఉడికే వరకూ అటూ ఇటూ తిప్పుతూ అన్ని వైపులా బాగా కాలేవరకూ ఉండి, తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ చికెన్ స్టిక్స్ రెడీ. వీటిని మీకు నచ్చిన సాస్ తో వడ్డిస్తే చాలా రుచికరంగా ఉంటుంది, . వేడి వేడిగా వడ్డిస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Spicy Chicken Sticks Recipe For Iftar Party

Non-vegetarian lovers would always love to munch on chicken. You would have tried the best recipes ever from every corner of the street. So, we have a good news for you. Today, we have a special chicken recipe that you will be tasting for the first time!
Story first published: Tuesday, June 21, 2016, 13:22 [IST]
Desktop Bottom Promotion