For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తందూరియన్ ఫిష్ టిక్కా రిసిపి

|

ఫిష్ టిక్కా ఎల్లప్పుడూ ఒక అద్భుతమైన వంటకం. ముఖ్యంగా వర్షాకాలానికి ఈ రిసిపి చాలా బాగా సూట్ అవుతుంది. ఈ వాతావరణంలో ఫిష్ టిక్కా వంటకాలను తింటూ ఎంజాయ్ చేస్తారు. వర్షాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఇటువంటి వంటకాలను రుచి చూడవచ్చు. ఫిష్ తో తయారుచేసే వంటల్లో వివిధ రకాల ఫిష్ కబాబ్ లు కూడా ఉన్నాయి. ఇటువంటి స్పైసీ వంటకాలను స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. కాఫీ మరియు టీలతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటాయి. కాబట్టి ఈ సీజన్ కు తగ్గట్టు ఫిష్ లవర్స్ కోసం ఫిష్ టిక్కాను తయారు చేసే విధానం తెలుసుకుందాం.

తందూరి ఫిష్ టిక్కా సాధారణంగా ఇది పంజాబీ రిసిపి. ఈ ఫిష్ టిక్కా రిసిపిని కొన్ని సందర్భాల్లో Amritsari fish tikka అని కూడా పిలుస్తుంటారు. ఈ ఫిష్ టిక్కాను తందూరి మసాలాలో మారినేట్ చేసి, తర్వాత గ్రిల్ చేస్తారు. ఈ ఫిష్ టిక్కాను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మైక్రో ఒవెన్ ఉంటే పని మరింత సులభం అవుతుంది. మరి స్పైసీ ఫిష్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం..

 తందూరియన్ ఫిష్ టిక్కా రిసిపి

చేపలు తినండి ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి చేపలు తినండి ఆరోగ్యాన్ని..ఆయుష్యును పెంచుకోండి

కావల్సిన పదార్థాలు:
బెట్కి లేదా రఘు ఫిఫ్: 500grms(బోన్ లెస్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పసుపు: చిటికెడు
ధనియాల పొడి: 1tsp
కారం: 1/2tsp
పెరుగు: 2tbsp
నిమ్మరసం: 1tbsp
శెనగపిండి: 1tbsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
ఛాట్ మసాలా: 1tsp
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)

సౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపిసౌంత్ ఇండియన్ స్టైల్ ఫిష్ ఫ్రై రిసిపి

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి శుభ్రం చేసి పెట్టుకొన్న చేప ముక్కలకు బాగా పట్టించి 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ధనియాల పొడి, కారం, మరియు తందూరి పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఈ మిశ్రమంలో శెనపిండిని కూడా మిక్స్ చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు ఈ తందూరి మసాలా, పెరుగు మిశ్రమాన్ని చేపలకు అన్నివైపులా పట్టించాలి.
5. తర్వాత ఓవెన్ ను 300డిగ్రీల్లో హీట్ చేయాలి. అంతలోపు చేప ముక్కల మీద నూనె చిలకరించాలి.
6. తర్వాత ఈ చేపముక్కలను అన్నింటిని మిక్స్ చేసి టూత్ స్టిక్స్ కు గుచ్చాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మరికొంత నూనెను చిలకరించాలి.
7. తర్వాత ఈ చేప ముక్కలను గ్రిల్ చేసి 60పర్సెంట్ పవర్ లో 15నిముషాలు బేక్ చేసుకోవాలి.
అంతే మీ తందూరి ఫిష్ టిక్కా రెడీ. తర్వాత stakesనుండి చేప ముక్కలను సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని కొత్తిమీర తరుగు మరియు ఛాట్ మసాలాతో , సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేయాలి.

English summary

Tandoorian Fish Tikka(Amritsari fish tikka )Recipe

Tandoori fish tikka is basically a Punjabi recipe. This fish tikka recipe is also called Amritsari fish tikka sometimes. This fish kebab comprises of chewy pieces of fish soaked in tandoori masala and then grilled in the tandoor. You can also prepare this fish tikka recipe at home in your microwave All the ingredients required for making tandoori fish tikkas are quite easily available.
Desktop Bottom Promotion