For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖీమా మమూస్ : హెల్తీ అండ్ టేస్టీ

|

మీరు ఎప్పుడైనా మమూస్ పేరు విన్నారా? మమూస్ చాలా టేస్టీగా...స్మూత్ గా..స్పైసీగా నోరూరిస్తుంటాయి. మమూస్ ను మాంసాహారంతో వండితే మరింత అద్భుత రుచిని కలిగి ఉంటాయి. మమూస్ ను వివిధ రకాలుగా వండుకోవచ్చు .

మమూస్ మంచి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యకరం కూడా . మమూస్ ను ఏ సమయంలో అయినా తినవచ్చు . బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ గా కూడా తీసుకోవచ్చు . డిన్నర్ కూడా తినవచ్చు . ఖీమా మమూస్ తయారుచేయడం చాలా సులభం. మమూస్ ను తయారుచేసుకోవడానికి ఖీమాతో పాటు, వెజిటేబుల్స్ మరియు ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. మరియు టేస్టీ అండ్ హెల్తీ మమూస్ ఎలా తయారుచేయాలో చూద్దాం....

Yummy Keema Momos Recipe: Telugu Vantalu


కావల్సిన పదార్థాలు:
క్యారెట్ - 1cup ( సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యాబేజ్ - 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బీన్స్ - 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
స్ప్రింగ్ ఆనియన్ - 1 cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ - 1 cup ( సన్నగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి - 1/2 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
మైదా - 4 cups
పెప్పర్ పౌడర్ - 1/4 tbsp
ఖీమా - 100 gms
బట్టర్ - 1 tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ లో 1/2టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు మరియు ఖీమా వేసి, ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే 1/4చెంచా పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
3. అంతలోపు మరో పెద్ద బౌల్ తీసుకొని అందులో నీళ్ళు మరియు ఉప్పు వేసి మిక్స్ చేయాలి. పిండిని మెత్తగా మ్రుదువుగా కలుపుకొని 10నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఈ పిండి నుండి కొద్దిగా (నిమ్మకాయంత సైజు)తీసుకొని చేతిలోనే వెడల్పుగా చేసుకోవాలి .
5. తర్వాత అలా వెడల్పుగా చేసుకొన్న మైదాలో కొద్దిగా ఖీమా మిశ్రమాన్ని పెట్టి నీట్ గా అన్నివైపులా క్లోజ్ చేయాలి . ఇలా కొన్ని
6. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో నీళ్ళుపోసి, ఒక రౌండ్ ప్లేట్ లో మమూస్ పెట్టాలి. ఆ ప్లేట్ ను కుక్కర్లో పెట్టి 10-15నిముషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
7. అంతే ఇప్పుడు యమ్మీ ఖీమా మమూస్ రెడీ . చాలా టేస్ట్ గా ఉండే మమూస్ ను చిల్లీ సాస్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి.

English summary

Yummy Keema Momos Recipe: Telugu Vantalu

There are different varieties of momos that you can prepare. But today, we shall teach you how to preprare yummy keema momos recipe.
Desktop Bottom Promotion