Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బొప్పాయి హల్వా ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యానికి నిధి..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
భారతీయ ఇళ్లలో స్వీట్ల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది హల్వా. అయితే హల్వాలో అనేక రకాలు ఉంటాయి. గుమ్మడికాయ హల్వా,బనానా హల్వా,క్యారెట్ హల్వా, బొప్పాయి హల్వా ఇలా బోలెడు వెరైటీలు ఉంటాయి. చలికాలంలో వేడివేడి హల్వా తినాలని చాలామంది కోరుకుంటారు. ఈ చలికాలంలో బొప్పాయి పండుతో చేసిన వేడివేడి హల్వా తింటే అద్భుతంగా ఉంటుంది. విభిన్నమైన, రుచికరమైన అలాగే మన జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ బొప్పాయి హల్వా.
బొప్పాయి హల్వా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో అంతే ఆరోగ్యకరం. విటమిన్ ఏ,ప్రొటీన్,కాల్షియం,ఐరన్,ఇతర పోషకాలు తగినంత పరిమాణంలో ఉంటాయి..ఇది అనేక సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బొప్పాయి హల్వా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. దీంతో మళ్లీ మళ్లీ తినకుండా ఉంటారు. బొప్పాయి హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. బొప్పాయి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
బొప్పాయి హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి బొప్పాయి
-పాలు
-చక్కెర
-నెయ్యి
-జీడిపప్పు
-ఎండుద్రాక్ష
-ఏలకులు
బొప్పాయి హల్వా తయారీ విధానం
-బొప్పాయి హల్వా చేయడానికి ముందుగా బొప్పాయి పండు తొక్కను తీసివేయండి. తర్వాత దాన్ని తురుముకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాలు పోసి మీడియం వేడి మీద మరిగించాలి.
-మరుగుతున్న పాలలో తురిమిన బొప్పాయి వేసి కలుపుతూ ఉడికించుకోవాలి.
-బొప్పాయి తరుము మెత్తగా అయ్యాక అందులో పంచదార వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో నెయ్యి వేసి కలుపుతూ ఉండండి.
-హల్వా చిక్కబడడం ప్రారంభించినప్పుడు తరిగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష అందులో వేయండి.
-చివరగా యాలకుల పొడిని బాగా కలపాలి హల్వా మందంగా, బంగారు రంగు వచ్చేవరకు ఉడికించాలి.
-బొప్పాయి హల్వా రెడీ. దాని మీద నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి వేడి వేడిగా తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












