Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
Central Bank Gold Buying Crashes 80% in January, Falls to Just 5 Tonnes WGC -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే!
చపాతీలోకి అదిరిపోయే బీన్స్ గ్రేవీ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
బీన్స్ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక సంజీవని లాంటిది. ఇందులో మన శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా తెలుగు ఇళ్లలో బీన్స్ తో వేపుడు (Fry) లేదా తాలింపు చేయడం అలవాటు.
కానీ బీన్స్ తో మసాలా దట్టించి చేసే బీన్స్ గ్రేవీ కర్రీ రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా చపాతీ, పూరీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చపాతీలోకి కొత్తగా ఏదైనా కర్రీ చేయాలంటే బీన్స్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి. చిక్కటి గ్రేవీతో టేస్ట్ చాలా బాగుంటుంది. బీన్స్ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-బీన్స్
-టమాటో
-పచ్చిమిరపకాయలు
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీడిపప్పు
-గరం మసాలా
-కొత్తిమీర
-కసూరి మేథీ
-ఆయిల్
-జీలకర్ర పొడి
తయారీ విధానం
-ముందుగా పావు కేజీ బీన్స్ ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 2 ఉల్లిపాయల సన్నని తరుగు,3 పచ్చిమిరపకాయల పొడవాటి చీలికలు, బీన్స్ ముక్కలు, 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి మీడియం మంట మీద కలుపుతూ 2 నిమిషాలు వేయించుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలతో పాటు బీన్స్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టి తక్కువ మంట మీద బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు కలుపుతూ ఉండాలి.
-ఈలోగా మిక్సీ జార్ లో 10 జీడిపప్పులు, 3 టమాటోల పెద్ద ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
-మెత్తగా మగ్గిన బీన్స్ ముక్కల్లో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు టమాటో పేస్ట్ వేసి కలుపుతూ వేగనివ్వాలి.
-బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో 2 టీస్పూన్ల కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1 టీస్పూన్ గరం మసాలా పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ సమయంలో మంటను తక్కువలో ఉంచుకోవాలి.
-బాగా కలుపుకున్న తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి కలిపాక అందులో కసూరి మేథీ 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడకించాలి.
-ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు, గ్రేవీ కొంచెం చిక్కగా ఉన్పప్పుడే స్టవ్ ఆపేయండి. అంతే బీన్స్ గ్రేవీ కర్రీ రెడీ. చివరగా అందుబాటులో ఉంటే ఇందులో ప్రెష్ క్రీమ్ వేసి కలుపుకుంటే అద్బుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









