Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
మైదా పిండి లేకుండానే..అప్పటికప్పుడు క్రిస్పీ,క్రంచీ చల్ల పునుగులు..ఎలా చేయాలంటే
చల్ల పునుగులు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, రుచికరమైన చిరుతిళ్లలో ఒకటి. ఇవి స్నాక్స్ గా లేదా అల్పాహారంగా చాలా బాగుంటాయి. బియ్యం పిండి, పుల్లటి మజ్జిగ, కొన్ని సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ పునుగులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి కోసం ఎలాంటి పప్పు లేదా పిండి నానబెట్టే పని ఉండదు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఎలాంటి పిండి లేనప్పుడు ఈ రెసిపిని ట్రై చేయవచ్చు.
పెద్దలకు టీ టైమ్ స్నాక్ గా, పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనిని టమాటో చట్నీ కలిపి తింటే ఆ టేస్ట్ నోటి నుంచి కొన్నాళ్ల పాటు పోదంతే. చల్లపునుగులు విత్ టమాటో చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్ధాలు
టమాటో చట్నీ కోసం
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-అల్లం
-వెల్లుల్లి
-కొత్తిమీర
-కరివేపాకు
-టమాటో
-చింతపండు
-పసుపు
-ఆవాలు
-జీలకర్ర
పుగుగుల కోసం
-సగ్గుబియ్యం
-బియ్యం పిండి
-పెరుగు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కరివేపాకు
-జీలకర్ర
-వంటసోడా
-ఆయిల్
వంకాయతో ఇంత రుచా? వంగీబాత్ టేస్ట్‌కి ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
తయారీ విధానం
ముందుగా టమాటో చట్నీ రెడీ చేసుకోండి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో అర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించాలి.
తర్వాత అందులో 6 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 ఇంచు అల్లం, 5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ, 5 టమాటోల పెద్ద ముక్కలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి కలిపి మూతపెట్టి ముక్కలు మెత్తగా మగ్గించుకోవాలి.
తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపి వాటిని చల్లారనివ్వాలి. తర్వాత దీనిని మిక్సీ గిన్నెలో వేసి అందులో కొంచెం వేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు,జీలకర్ర,కరివేపాకు,ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి అది ఈ చట్నీలో వేసి కలుపుకోండి. అంతే టమాటో చట్నీ రెడీ.
ఇప్పుడు పునుగుల కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1/3 కప్పు సగ్గుబియ్యం వేసి చిన్న మంట మీద దోరగా వేయించి చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో సగ్గుబియ్యం గ్రైండ్ చేసిన పొడి, 1 కప్పు బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, ముప్పావు కప్పు కొద్దిగా పులిసిన పెరుగు, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్ది కొద్దిగా నీళలు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి.
కలిపిన పిండిలో సన్నగా కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, పావు కప్పు ఉల్లిపాయ తరుగు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు కూడా వేసి మొత్తం కలిసేలా కలపి మూతపెట్టి పావు గంట సేపు వదిలేయండి.
తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానిక సరిపడా ఆయిల్ వేడి చేసి అందులో పిండిని చిన్న ముద్దల్లా తీసుకొని ఆయిల్ లో వేసుకోండి. బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీసేయండి. అంతే టేస్టీ చల్ల పునుగులు రెడీ. వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో చట్నీతో కలిపి తింటే అదరహో అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










