Latest Updates
-
మేషం, వృశ్చికం, సింహ రాశుల వారికి భారీ అదృష్టం.. ఈరోజు మీ జాతకం ఎలా ఉందంటే? - మంగళవారం, 07 ఏప్రిల్ 2026 -
చుక్క నూనె లేకుండా ..రెండేళ్ల పాటు నిల్వ ఉండే టేస్టీ మామిడికాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
ఆరోగ్యానికి అసలైన ఆమ్లెట్..డాక్టర్ సూచిస్తున్న పర్ఫెక్ట్ ఎగ్ రెసిపీ ఇదే! -
పోషకాల గని మునగాకుతో కరకరలాడే పూరీలు.. తయారీ విధానం ఇదే! -
ఎవ్వరినీ వదలని విటమిన్ B12, విటమిన్ D,ఐరన్ లోపాలు..రోజూ ఏం చేయాలంటే.. -
కరివేపాకు ఎండుకొబ్బరి పచ్చడి..వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా కేక! -
క్రిస్పీ ఎర్ర కందిపప్పు దోశ..బరువు తగ్గాలనుకునేవాళ్లకి బెస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్, అసిడిటీకి చెక్..పప్పు వండే అసలైన సీక్రెట్ రివీల్ చేసిన ప్రముఖ చెఫ్ -
హైదరాబాద్ లో లవ్ జీహాద్?: బలవంతంగా ఇస్లాంలోకి మార్చి..తొలిరాత్రే నలుగురితో కలిసి అత్యాచారం -
వృశ్చికం, మీనం, కర్కాటక రాశుల వారికి శివుని అనుగ్రహం.. ఎవరికి ధనయోగం? - సోమవారం, 06 ఏప్రిల్ 2026
జొన్న రొట్టె, చపాతీకి అదిరిపోయే సైడ్ డిష్..గుజరాత్ ఫేమస్ కారప్పూస టమాటో కర్రీ..ఎలా చేయాలంటే..
వంట చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించకుండానే, వేడివేడిగా,రుచికరమైన కర్రీ చేసుకోవాలనుకుంటే గుజరాత్ లోని కతియావాడి స్పెషల్ కారప్పూస టమాటో బెస్ట్ ఆప్షన్. కేవలం గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్రల్లోనూ ఎంతో ప్రజాదరణ పొందిన కూర.. సాధారణ రోటీలను కూడా అమృతంలా మార్చేస్తుంది.
టమాటాల పుల్లటి రుచి, సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలు, దానికి తోడు లావుపాటి కారప్పూస ఇచ్చే కరకరలాడే అనుభూతి..ఇవన్నీ కలిసి ప్రతి ముద్దనూ ఓ పండగలా చేస్తాయి. గుజరాతీ స్టైల్ లో ఈ కూరను టమాటాలు బాగా ఉడికించి, కొద్దిగా బెల్లం వేసి తీపి, పులుపుల కలయికగా మృదువుగా చేస్తారు. అదే రాజస్థానీ స్టైల్ లో అయితే వెల్లుల్లి, ఘాటైన మసాలాలు ఎక్కువగా వాడి స్పైసీగా తయారు చేస్తారు. ఎలా చేసుకున్నా దీని రుచి మాత్రం అద్భుతమే.
కారప్పూస టమాటో కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-ఉప్పు
-పచ్చిమిర్చి
-అల్లం
-పండిన టమాటాలు
-లావు కారప్పూస
-కాస్త బెల్లం లేదా పంచదార
కారప్పూస టమాటో కర్రీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు కడాయిలో సన్నగా తరిగిన టమాటో ముక్కలను వేసి, అవి మెత్తబడి నూనె పైకి తేలేంతవరకు బాగా మగ్గనివ్వాలి.
-టమాటోలు గుజ్జులా మారిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కతియావాడి అసలైన రుచి కావాలనుకుంటే ఈ దశలోనే కొద్దిగా బెల్లం కలుపుకోండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఓ 5 నుంచి 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి.
-అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లావు కారప్పూస వేసి సున్నితంగా కలపాలి. గ్రేవీలో ముందే వేసి ఉడికిస్తే అది మెత్తబడిపోయి కూర రుచి పాడవుతుంది. అందుకే భోజనానికి కూర్చునే సరిగ్గా రెండు నిమిషాల ముందు మాత్రమే సేవ్ కలపాలి. గ్రేవీ మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు, పల్చగా ఉంటే ఇంకొద్దిసేపు మరిగించాలి.
-వేడివేడిగా తయారైన కతియావాడి కారప్పూస టమాటో కర్రీపై కొద్దిగా కొత్తిమీర చల్లి వడ్డించండి. చపాతీ, పరాఠా, లేదా మన తెలుగువారికి ఇష్టమైన జొన్న, సజ్జ రొట్టెలతో దీని కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







