Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Ragi Poori Recipe:రుచికరమైన రాగి పూరిలు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు..
Ragi Poori Recipe: రాగి పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగిపిండితో రాగి ముద్ద, రాగి రొట్టి, రాగి దోసె వంటి వివిధ రకాలు వంటకాలు తయారుచేసుకుని తింటారు. వేసవి కాలం వచ్చిందంటే రాగి అంబలి ఫేమస్. ఒంట్లో వేడి తగ్గించడానికి రాగి అంబలి రోజూ తాగుతారు. రాగిపిండితో తయారుచేసే వంటలు సాధారణ ప్రజల కంటే మధుమేహగ్రత్తులు ఎక్కువ మేలు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఈ మిల్లెట్ మధుమేహుల్లో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా చేస్తాయి. డయాబెటిస్ పేషంట్స్ రోజూ రాగి జావా తాగమని డాక్టర్లు చెబుతుంటారు. మధుమేహాన్ని కంట్రోల్ చేసే శక్తి రాగులకు ఉంది. ఈ రోజు మైదాతో చేసిన పూరీలకు బదులుగా ఒకసారి రాగిపిండితో చేసి పూరీలను ప్రయత్నించండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. దీనికి ప్రత్యేకంగా కుర్మాలు, సాగులు అవసరం లేదా ఏకూరతో తిన్నా రుచిగా ఉంటుంది. అంతే కాదు వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. మరి ఇంకెందుకు ఆలస్యం రాగి పూరీలను ఎలా తయారుచేయాలో చూసేద్దాం.

Image Courtesy
రాగి పూరీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - 1 cup
గోధుమపిండి -1/2 tsp
బంగాళదుంప - 1
నువ్వులు - 1 tsp
కారం - 1/2 tsp
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
నీరు - పిండికలుపుకోవడానికి సరిపడా
రాగి పూరి తయారుచేయు విధానం
1. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని బంగాళదుంపలను కట్ చేసి వేసి బాగా శుభ్రంగా కడిగి మరో గిన్నెలో వేసుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి బంగాళదుపంల ముక్కలు వేసి ఉడికించి మెత్తగా చేత్తోనే మెదుపుకోవాలి.
3. తర్వాత బంగాళదుపంల పేస్ట్ లో నే రాగిపిండిని, అరకప్పు గోధుమపిండిని వేయాలి.
4. అదే మిశ్రమంలో పైన సూచించిన విధంగా ఉప్పు, కారం, చిటికెడు ఇంగువ వేసి బాగా స్మూత్ గా కలుపుకోవాలి.
5. రుచికి సరిపడా ఉప్పును సరిచూసుకుని కలుపుకోవాలి. మొత్తం పిండిని గోరువెచ్చని నీటితో పూరీ పిండిలా కలుపుకోవాలి.
6. ఈ కలుపకున్న పిండిని కొద్ది సేపు పక్కన పెట్టి 15 నిముషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల ఆకారంలో ఒత్తుకోవాలి.
7. పూరీల్లా ఒత్తుకున్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
9. నూనె వేడి అయ్యాక ఆ నీటిలో ఈ రాగి పూరీలను వేసి రెండు వైపులో తిప్పి వేయించాలి.
10. రెండు వైపులా పూరీల్లా పొంగి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
11. అంతే రాగి పూరీలు రెడీ. ఈ రాగి పూరీలను ఏ కూరతో తిన్నా రుచిగా ఉంటాయి. కోడి కూరతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. ఎగ్ బుర్జీ కూడా ఇది మంచి కాంబినేషన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications