Latest Updates
-
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!
రెస్టారెంట్ రుచిని మించేలా.. ఇంట్లోనే వెజ్ మంచూరియన్ సూప్ ఇలా చేసుకోండి!
శీతాకాలంలో సాయంత్రం అయ్యేసరికి చల్లగాలికి శరీరం వణికిపోతుంది. ఆ సమయంలో ఏదైనా వేడివేడిగా తాగాలనిపించడం సహజం. ముఖ్యంగా సూప్స్ తాగడం వల్ల శరీరానికి తక్షణ వెచ్చదనంతో పాటు, శక్తి కూడా లభిస్తుంది.
అయితే బయట దొరికే సూప్స్ రుచిగా ఉన్నప్పటికీ, అవి ఎంతవరకు ఆరోగ్యకరమో చెప్పలేం. కానీ అదే రెస్టారెంట్ రుచితో ఇంకా చెప్పాలంటే అంతకంటే అద్భుతమైన రుచితో వెజ్ మంచూరియన్ సూప్ ను మీరే ఇంట్లో తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
సన్నగా తరిగిన క్యాబేజీ-2 టేబుల్ స్పూన్లు
బీన్స్-2 టేబుల్ స్పూన్లు
క్యారెట్- 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్-2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు-2 టేబుల్ స్పూన్లు
స్వీట్ కార్న్-2 టేబుల్ స్పూన్లు
పనీర్ ముక్కలు-2 టేబుల్ స్పూన్లు
వెన్న-2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి తరుగు-కొంచెం
అల్లం తరుగు- కొంచెం
పచ్చిమిర్చి-1
ఉప్పు-రుచికి సరిపడా
మిరియాల పొడి-1 టీస్పూన్
నిమ్మరసం-కొద్దిగా
టమోటా సాస్-3 టీస్పూన్లు
చిల్లీ సాస్-2 టీస్పూన్లు
సోయా సాస్- 3 టీస్పూన్లు
షెజ్వాన్ చట్నీ-2 టీస్పూన్లు
మొక్కజొన్న పిండి- 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు-సుమారు 4-5 కప్పులు
తయారీ విధానం
-ముందుగా క్యాబేజీ, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సూప్ లో కూరగాయలు ఎంత సన్నగా ఉంటే అంత రుచిగా ఉంటాయి.
-స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో రెండు స్పూన్ల వెన్న వేసి కరిగాక అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి మంచి వాసన వచ్చాక, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ (క్యాబేజీ, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్) పాన్ లో వేయాలి. వీటిని పూర్తిగా ఉడికించకూడదు. కొంచెం క్రంచీగా తగిలేలా సగం ఉడికితే చాలు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఘాటు కోసం మిరియాల పొడి వేసి కలపాలి.
-కూరగాయలు కాస్త వేగాక అందులో సుమారు ఒకటిన్నర లీటరు (లేదా మీకు కావలసిన చిక్కదనాన్ని బట్టి) నీళ్లు పోసి మరిగించాలి.
-సూప్ మరుగుతున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో టమోటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, షెజ్వాన్ చట్నీ వేసి బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని మరుగుతున్న సూప్ లో వేయాలి. పనీర్ ముక్కలను కూడా ఇప్పుడు జోడించవచ్చు.
-సూప్ నీళ్ళలా కాకుండా చిక్కగా, హోటల్ స్టైల్ లో రావాలంటే కార్న్‌ఫ్లోర్ చాలా ముఖ్యం. ఒక చిన్న కప్పులో 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సూప్ లో పోస్తూ కలపాలి.
-2-3 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా కొన్ని చుక్కల నిమ్మరసం పిండండి. (స్టవ్ మీద ఉండగా నిమ్మరసం పిండితే చేదు వచ్చే అవకాశం ఉంది).
-అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియన్ సూప్ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని, పైన ఫ్రైడ్ నూడుల్స్ లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తాగితే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












