Latest Updates
-
మాధవీలత దుర్గా స్తుతి..ముస్లింల తీవ్ర ఆగ్రహం..భగవద్గీత శ్లోకంతో ట్రోలర్స్ కి మాధవీలత చెక్! -
Rama Navami 2026: శ్రీరాముడి గురించి చాలామందికి తెలియని రహస్యాలు ఇవే! -
డీప్ ఫ్రై లేదు,రుచిలో తగ్గేదే లేదు..చుక్క నూనె లేకుండానే కరకరలాడే పొటాటో కట్లెట్స్ -
ఈరోజు రాశి ఫలాలు (25.03.26): బుధవారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ -
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా! -
ఈరోజు రాశి ఫలాలు (24.03.26): మంగళవారం నాడు ఈ రాశుల వారికి ధనయోగం! -
కామద ఏకాదశి 2026 తేదీ, పూజా ముహూర్తం, విష్ణుమూర్తి ఆశీస్సులు పొందే శక్తివంతమైన మంత్రం -
అన్నంలోకి అమృతంలా ఉండే పెరుగు వంకాయ గ్రేవీ.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ! -
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
గుటకలేయించే రుచితో..ఎండాకాలంలో అమృతంలాంటి మామిడికాయ పచ్చిపులుసు
భానుడు భగభగ మండుతున్నాడు. రోహిణి కార్తె రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వంట చేయాలన్నా, వేడివేడిగా తినాలన్నా విసుగొచ్చేస్తోంది. ఇలాంటి సమయంలో కడుపులోకి చల్లగా, గొంతులోకి జారుగా వెళ్లే ఆహారం ఉంటే హాయిగా ఉంటుంది. వేసవి తాపాన్ని తీర్చి, ఒంటికి చలవ చేసే వంటకాల్లో మన తెలంగాణ, ఆంధ్రా ఇళ్లలో చేసుకునే పచ్చిపులుసు స్థానం ఎప్పటికీ ప్రత్యేకం.
అందులోనూ ఇప్పుడు మామిడికాయల సీజన్. చింతపండుకు బదులుగా పచ్చి మామిడికాయతో పచ్చిపులుసు చేసుకుంటే ఆ రుచే వేరు. పుల్లపుల్లగా, కారంకారంగా, ఉల్లిపాయలు తగులుతూ ఉంటే.. అన్నం అంతా ఈ పులుసుతోనే లాగించేయాలనిపిస్తుంది. ఎండాకాలంలో అమృతంలా అనిపించే, ఆరోగ్యానికి మేలు చేసే మామిడికాయ పచ్చిపులుసు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
మామిడికాయ పచ్చిపులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
మామిడికాయ: 1
పచ్చిమిర్చి: 3
మెంతులు: 1 టేబుల్ స్పూన్
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
నువ్వులు: 1 టీ స్పూన్
ఎండుమిర్చి: 2
ఉల్లిగడ్డ తరుగు: 1 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: తగినన్ని
తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు,
కరివేపాకు
పసుపు: చిటికెడు
కొత్తిమీర: కొద్దిగా
మామిడికాయ పచ్చిపులుసు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మంటను సిమ్ లో ఉంచి మామిడికాయను, పచ్చిమిర్చిని పొయ్యి మీద నేరుగా కాల్చుకోవాలి. పాత కాలంలో నిప్పుల మీద కాల్చేవారు.. ఆ స్మోకీ ఫ్లేవరే పచ్చిపులుసుకు అసలైన రుచినిస్తుంది. చుట్టూ కాస్త నల్లగా మారేంతవరకు కాల్చుకుని పక్కన చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని అందులో నువ్వులు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. చల్లారాక వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-పొయ్యి మీద కాల్చుకున్న మామిడికాయ, పచ్చిమిర్చి చల్లారిన తర్వాత వాటిపై ఉన్న నల్లటి పొట్టును నెమ్మదిగా తీసేయాలి. మామిడికాయ గుజ్జును కత్తితో ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కలను, కాల్చిన పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్ట్ లా పట్టుకోవాలి.
-ఒక పెద్ద గిన్నెలో మామిడికాయ పేస్ట్, ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి వేయాలి. అందులో తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. మామిడికాయ పులుపును బట్టి నీళ్ల పరిమాణాన్ని చూసుకుని పోయాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
-ఈ పచ్చిపులుసుకు ప్రాణం పోసేది తాలింపు. ఇందుకోసం పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. చిటపటలాడే ఈ పోపును తీసుకెళ్లి పచ్చిపులుసులో వేసి కలపాలి. పైన కాస్త కొత్తిమీర చల్లుకుంటే ఘుమఘుమలాడే మామిడికాయ పచ్చిపులుసు రెడీ.
-వేడివేడి అన్నంలో ఈ పచ్చిపులుసు కలుపుకుని తింటుంటే, కాల్చిన మామిడికాయ ఫ్లేవర్, ఉల్లిపాయల కరకర, మసాలా ఘాటు అన్నీ కలిసి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









