For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలూ ఛాట్: నవరాత్రి స్పెషల్ ఈవెనింగ్ స్నాక్

|

ఆలూ ఛాట్ చాలా సింపుల్ వెజిటేరియన్ స్నాక్ రిసిపి. ఆలూ ఛాట్ కు కావల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. ముఖ్యంగా ఈ స్నాక్ రిసిపిని ఈవెంగ్ టైమ్ లో తీసుకుంటారు. నవరాత్రి స్పెషల్ గా ఈ వంటను తయారుచేసుకోవచ్చు. పండుగల సమయాల్లో ఇలాంటి వంటలు కొద్దిగా ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

ఆలూతో తయారుచేసే వంటలను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు కాబట్టి, ఈ రోజు మనం ఒక స్పెషల్ వెజిటేరియన్ రిసిపిని ప్రయత్నిస్తున్నా. ధనియాల పొడి, మరియు కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ తో పాటు డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. తర్వగా కూడా తయారవుతుంది. ఈ సింపుల్ అండ్ క్విక్ ఆలూ ఛాట్ కు కొత్తిమీర చేర్చడం వల్ల అదనపు టేస్ట్ ను అంధిస్తుంది. మరి ఆలూ ఛాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

Aloo Chat: Navratri Special

కావల్సిన పదార్థాలు:

బంగాళదుంపలు- 4 (ఉడికించి, మరియు మందపాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ- 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ధనియాలు- 1tbsp (రఫ్ గా పొడిచేసుకోవాలి)
ధనియాలపౌడర్- 2tsp
ఆమ్చూర్ (పొడి మామిడి) - 1tsp
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు - 1tsp
కారం: 1tsp
నూనె : 2 tbsp
కొత్తిమీర- 2tbsp (గార్నిష్ కోసం)

తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ధనియాల పొడి వేసి కొన్ని సెకండ్లు వేగించుకోవాలి.
2. ఇప్పడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులోనే బంగాళదుంప ముక్కలు కూడా వేసి 5నిముషాలు వేగించుకోవాలి.
4. 5నిముషాల తర్వాత అందులో పసుపు, కారం, ధనియాలపొడి, డ్రై మ్యాంగో పౌడర్, ఉప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ఆలూ చాట్ రెడీ. ఇది ఒక టేస్టీ అండ్ హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి.

English summary

Aloo Chat: Navratri Special

This is when aloo comes to your rescue. Almost everyone loves to eat aloo or potatoes. Therefore today we have a special Navratri vegetarian recipe for you which is made entirely with potatoes. Dhaniya aloo ki sabji is one of the easiest vegetarian recipes which you can prepare without hassle. The aroma of coriander makes this dish a lip-smacking treat for all.
Desktop Bottom Promotion