For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారానురక్తి పొందాలంటే అంజీర జ్యూస్ తాగల్సిందే..

|

ఆరోగ్యానికి అంజీర ఫలము : కొంచెం వగరు.. కొంచెం తీపి .. కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరము చేసే పోషకాలను అందిస్తుంది. విరివిగా లభించే అంజీర్‌ పచ్చివి, ఎండువి ఒంటికి చలువ చేస్తాయి. • అంజీర ఫలం లో కొవ్వు, పిండివదార్థాలు, సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి. ఖనిజాలు, పీచు, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. పాలు, పాల వదార్థాలు పడని వారు వీటిని పది నుంచి వన్నెండు చొవ్పున తీసుకుంటే శరీరానికి క్యాల్షియం, ఇనుము అందుతాయి. అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.

Anjeer juice
కావలసిన పదార్థాలు:
అంజీర డ్రై ఫ్రూట్స్‌: 4
నీరు: 1cup
బెల్లం : 1tbsp
యాలకులు: 2
అల్లం: ఒక అంగుళం ముక్క
తులసి: 5

తయారు చేసే విధానం:
1. ముందుగా అంజీర్ పండ్లని అరకప్పు నీటిలో దాదాపు 2 గంటలు నానబెట్టి చేత్తో చిదిమి నీటిలో కరిగించాలి.
2. తర్వాత మరో కప్పు నీటిలో బెల్లం వేడిచేసి తులసి ఆకులు, చిదిమిన యాలకులు, అల్లం వేసి మూతపెట్టాలి.
3. గంట తర్వాత వడకట్టి కరిగిన అంజూర్‌ నీటిలో కలిపి తాగాలి. ఈ వేసవికి ఎంతో చల్లదనాన్నిచ్చే పానీయమిది. అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.

English summary

Anjeer juice-Healthy Drink | శృంగారానురక్తి పొందాలంటే అంజీర జ్యూస్ తాగల్సిందే..

Fig or Anjeer is one of the fruits high in vitamin, mineral and fiber content. Fig also contains lot of healing properties.Fresh figs are lusciously sweet with a texture that combines the chewiness of their flesh, the smoothness of their skin, and the crunchiness of their seeds.
Story first published: Tuesday, May 14, 2013, 16:40 [IST]
Desktop Bottom Promotion