For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్‌ - గ్రేప్స్‌ క్రష్డ్‌ ఐస్‌

|

Apple - Grapes Crushed Ice
ఆరోగ్యానికి పండ్లు ఎంతో బాగా ఉపయోగపడుతాయి. ఒక్క ఆరోగ్యానికే కదా చర్మం సంరక్షణకు కూడ పండ్ల వల్ల ఉపయోగమున్నది. ఎందుకంటే ప్రతి రోజూ మనం తీసుకొనే పండులో పోషక విలువలు, ఫైబర్ ఎక్కువగానే లభిస్తాయి. పండ్లను సేవించడం వలన శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయనడంలో సందేహం లేదు. శరీర బరువును నియంత్రించడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ కొవ్వును నియంత్రిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లను తీసుకోవాలనుకుంటే వీలైనంత మేరకు కడుపు ఖాళీగానున్నప్పుడు తీసుకోండి. భోజనానంతరం పండ్లను ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోకండి. ఎందుకంటే భోజనానంతరం పండ్లను తీసుకుంటే కడుపులో గ్యాస్‌ పెరుగుతుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పూర్తిగా పండిన పండ్లను తినకండి. వీటిలోనున్న పుష్టికరమైన గుణాలు పూర్తిగా నశించిపోయివుంటాయి. పండ్ల రసానికన్నా పండ్లను సేవించడమే ఉత్తమమంటున్నారు వైద్యులు.

ఎర్రటి యాపిల్ పండులోనున్న ఫ్లేవోనాయిడ్ తత్వం వలన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొదిస్తుంది. దీంతో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఆరోగ్యంగాను ఉంటుంది. యాపిల్ పండ్లలో శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు సమపాళ్ళల్లో ఉంటాయి. అలాగే క్యాలరీలను తగ్గిస్తుంది. శరీరంలోని క్యాలరీలను తగ్గించడంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది. ఇతర సమస్యలను దరిచేరనీయదు. కొందరు ఆరోగ్యంగా ఉండాలని ఉప్పును తగ్గిస్తుంటారు. అలాంటి వారికి యాపిల్ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు...
ఆపిల్‌ రసం: 2cups
ద్రాక్ష రసం: 2cups
నిమ్మరసం: 2tbps
తేనె: 2tbsp
పంచదార సిరప్‌: 1/2cup
ఐస్‌ ముక్కలు: కావాల్సినన్ని
ఆపిల్‌ ముక్కలు: 1/2cup
ద్రాక్షపళ్లు: 1/2cup
ఫైనాపిల్ ముక్కుల: 1/4cup

తయారు చేయు విధానం...
1. ముందుగా తగినన్ని ఐస్‌ ముక్కల్ని తీసుకుని మరీ మెత్తగా కాకుండా ఓ మోస్తరుగా చితగ్గొట్టి గాజు బౌల్ లోకి తీసుకోవాలి.
2. ఇప్పుడు ఒక బౌల్‌లో ఆపిల్‌, ద్రాక్ష రసాలను (ఆపిల్‌, గ్రేప్స్‌ ముక్కలను విడివిడిగా జ్యూసర్‌ లో వేసి బ్లెండ్‌ చేస్తే రసం) తీసి పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో తేనె, నిమ్మరసం, పంచదార సిరప్‌ లను వరుసగా వేసి బాగా కలియబెట్టాలి.
4. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ముక్కలు వేసిన గ్లాసుల్లోకి కాస్త వెలితి ఉండేటట్లుగా పోయాలి. చివర్లో తరిగి ఉంచుకున్న ఆపిల్‌, ఫైనాపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లను పైన చల్లితే ఆపిల్‌ గ్రేప్స్‌ క్రష్డ్‌ ఐస్‌ రెడీ..!

English summary

Apple - Grapes Crushed Ice... | ఆపిల్‌ - గ్రేప్స్‌ క్రష్డ్‌ ఐస్‌

Fruit Ice is very tasty and also extremely good for health. Here is the simple procedure for making mixed fruit ice at home. Good bacteria can prevent imbalances in the body and also keeps various infections at bay. It's really advisable to use adequate fruit for maintaining a healthy life style.
Story first published:Friday, June 22, 2012, 13:09 [IST]
Desktop Bottom Promotion