For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెడ్ ఛాట్: ఈవెనింగ్ స్నాక్ రిసిపి

|

ఈవెనింగ్ స్నాక్ రిసిపిలలో వివిధ రకాల స్నాక్స్ ఉన్నాయి. మనం ఇంట్లో తయారు చేసుకొనే కాక, స్ట్రీట్స్ లో వివిధ రకాల వెరైటీ స్నాక్స్ ను తయారుచేస్తుంటారు. చలికాలం, మరియు వర్షాకాలంలో వేడి వేడి స్నాక్ రిసిపిలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది.

చల్లని వాతావరణంలో మంచి ఫ్లేవర్ తో నోరూరిస్తుంటాయి. అటువంటి వంటల్లో బ్రెడ్ ఛాట్ కూడా ఒకటి. వీటిని స్ట్రీట్ ఫుడ్స్ గా కూడా పిలుస్తారు. ఈ స్ట్రీట్ ఛాట్ ను మనం ఇంట్లోనే తయారుచేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఈ ఛాట్ తయారుచేయడానికి ముఖ్యంగా కావల్సింది, బ్రెడ్, ఛాట్ మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మరికొన్ని మసాలా పొడులు. మరి మీరు కూడా ఈవెనింగ్ స్నాక్ రుచి చూడాలంటే క్రింది పద్దతిని ఫాలో అయిపోండి...

Bread Chaat Recipe:evening snack

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్ స్లైస్: 5(టోస్ట్ చేసినవి)
చిక్కటి పెరుగు: 1cup
దేశీ నెయ్యి: 1tsp
కారం ¼ tsp
పచ్చిమిర్చి 1 (సన్నగా కట్ చేసినది)
జీలకర్ర పొడి: 1tsp
ధనియా పొడి: 1tsp
ఛాట్ మసాలా: 1tsp
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగినది)
పుదీనా : 2tbsp (సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 మీడియం సైజ్ (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటో: 1 మీడియం సైజ్ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
సేవ్(సన్నమిక్షర్) మరియు వేరుశెనపప్పు: గార్నిష్ కోసం కొద్దిగా

తయారుచేయు విధానం:
1. బ్రెడ్ టోస్ట్ చేయడానికి ముందుగానే బ్రెడ్ ను స్లైస్ గా కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి .
2. తర్వాత పెనం మీద కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వాత బ్రెడ్ స్లైస్ వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా మరియు బ్రౌన్ గా మారిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఒక ప్లేట్ కి తీసుకొన్న వెంటన్ వాటి మీద సన్నగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి, పుదీనా మరియు కొత్తిమీర తరుగును వేయాలి.
4. తర్వాత వాటి మీద సాల్ట్, కారం, ఛాట్ మసాలా, ధనియా పౌడర్ మరియు జీలకర్ర పొడి చిలకరించాలి.
5. తర్వాత మొత్తంఇలా సర్దుకొన్న తర్వాత వాటి మీద ఒక టీ స్పూన్ పెరుగును నిధానంగా వేయాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైస్ మీద వేసుకోవాలి.
6. చివరగా సేవ్ మరియు వేరుశెనగపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే బ్రెడ్ ఛాట్ ఈవెనింగ్ స్నాక్ రెడీ.

English summary

Bread Chaat Recipe:evening snack

As monsoon is hitting various parts of the country, having spicy street chaats and pakoras become difficult. Hygiene and water logged alleys make you stay at home and leave those unhygienic street food out of your diet. In order to maintain hygiene, you do not have to give up on chaats. You can make healthy and fresh chaats at home that are tasty, spicy and filling enough to satisfy your taste buds.
Story first published: Friday, June 20, 2014, 18:23 [IST]
Desktop Bottom Promotion