For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ బర్ఫీ

|

Carrot Barfi
కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము - 1 cup
కొబ్బరి తురుము - 1 cup
పంచదార - 1cup
నెయ్యి / డాల్డా - 100 grms
ద్రాక్ష - 25 grms
యాలకలు - 4
జీడిపప్పు - 25 grms
బాదం - 25 grms
పిస్తా - 25 grms

తయారు చేయు విదానం:

1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి తురిమి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి అందులో వేసి కొంచెం దోరగా వేపి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే పాన్ లో మరి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి ఒక బౌల్ లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి, యాలకల పొడి చల్లి బాగా కలపాలి కొద్దిగా వేడి అయిన తర్వాత వేయించి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ లో సగ బాగాన్ని అందులో వేసి బాగా కాచి ముదురు పాకం వచ్చేవరకు స్పూన్ తో కలుపుతూ ఉండాలి.
4. పంచదార పాకం దగ్గర పడే సమయంలో అందులో వేయించి పెట్టుకొన్న క్యారెట్, కొబ్బరి తురుము అందులో వేసి కొద్దిగా గట్టిపడ్డాక, ఆ మిశ్రమాన్ని తీసి మందపాటి వెడల్పైన ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి అందులో వేసి దాని మీద కూడా డ్రైఫ్రూట్స్ చల్లి ఆరిన తర్వాత మనకు కావలసిన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేయవచ్చు.

Story first published:Monday, November 16, 2009, 16:04 [IST]
Desktop Bottom Promotion