For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెన్నదాల్-బనానా ఖీర్ రిసిపి-రాఖీ స్పెషల్

|

రక్షాబంధన్ సందర్భంగా మీకో స్పెషల్ స్వీట్ ట్రీట్ ను అంధిస్తున్నాం. శెనగపప్పు-అరటిపండు కాంబినేషన్ లో తయారు చేసే ఈ స్పెషల్ స్వీట్ రిసిపి, రాఖీ పండుగకు చాలా ఫర్ ఫెక్ట్ స్వీట్ అని చెప్పవచ్చు. ఖీర్ అనేది చాలా వరకూ హిందూ పండగలంటినికి తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. మరి మీకు ఖీర్ తయారు చేసుకోవాలని ఇష్టం అయితే కొంచె వెరైటీగా టేస్టీగా ఇటువంటి ఖీర్ ను తయారు చేసుకోవాచ్చు .

ఇది చాలా సులభమైనటువంటి రక్షాబంధన్ రిసిపి. ప్రతి చెల్లెమ్మా వారి అన్నదమ్ముల కోసం తప్పకుండా ప్రయత్నించాల్సిన ఓ వెరైటీ వంటకం. ఈ సాయంకాలం మీ అన్నయ్యకోసం ఒక తియ్యటి రుచిని అన్నకు అందించండి. గుప్పెడు డ్రైఫ్రూట్స్ తో నింపిన చెన్నదాల్ బనానా ఖీర్ చాలా టేస్టీ స్వీట్. మరి ఇకెందుకు ఆలస్యం. ఈ వంటను ట్రై చేసి మీ అన్న వద్ద ప్రశంసలు కొట్టేయండి.

మరి ఈ రక్షాబంధన్ స్సెషల్ ట్రీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం..

Chana Dal Banana Kheer Recipe

కావల్సిన పదార్థాలు:
శెనగపప్పు: 1cup
అరటి: 2 (పండిన, మీడియం సైజ్ అరటి పండ్లు)
కుంకుమపువ్వు పౌడర్: 1చిటికెడు
ఏలకుల పొడి: 1tbsp
చక్కెర: 2 cups
కండెన్డ్స్ మిల్క్: 1can(పాలను బాగా కాచీ, వెన్నతీసి చల్లార్చిన పాలు)
పాలు: 3cups
కొబ్బరి: 2cups(తురుము)
డ్రై ఫ్రూట్స్(ఎండిన పండ్లు): 1cup(ఎండుద్రాక్ష మరియు జీడిపప్పు)
నెయ్యి: 2tbsp

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నెయ్యి వేసి, మీడియ మంట మీద కరిగనివ్వాలి.
2. తర్వాత కరిగిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి, లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. మీడియం మంట పెట్టి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో శుభ్రంగా కడిగిపెట్టుకొన్న శెనగపప్పు , పాలు పోసి బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తర్వాత పప్పుగుత్తితో పప్పును బాగా మెత్తగా పాముకోవాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమానికి కండెన్డ్ మిల్క్, కుంకుమపువ్వు, పంచడార మరియు యాలకులపొడి వేసి తక్కువ మంట మీదా ఉడికిస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి.
5. ఇప్పుడు బాగా పండిన అరటి పండును ముక్కలుగా చేసి, ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించేటప్పుడు పాలు పక్కకు పొంగిపోకుండా మద్యమద్యలో కలియబెడుతుండాలి.
6.పాల మిశ్రమం చిక్కబడ్డాక, మంటను తగ్గించి మరియు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేయాలి. అంతే మీ రక్షాబందన్ స్పెషల్ స్వీట్ రిసిపి రెడీ. ఈ చెన్న దాల్ ఖీర్ వేడి వేడిగా లేదా చల్లగా కూడా మీకు ఇష్టం వచ్చినట్లు తినవచ్చు.

English summary

Chana Dal Banana Kheer Recipe: Raksha Bandhan

For Raksha Bandhan, we present to you one of the most famous recipes of all time, the Chana dal banana kheer. Kheer is widely prepared in almost every Hindu festival. If you like kheer, then this is one of the best dishes you can learn.
Story first published: Tuesday, August 20, 2013, 12:14 [IST]
Desktop Bottom Promotion