For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీజ్ మష్రుమ్ పకోడా-హెల్తీ ఈవెనింగ్ స్నాక్

|

ప్రతి రోజూ సాయంత్రం స్నాక్స్ తయారు చేయాలంటే చేసినవే చేసిచేసి బోరుకొడుతుంది. కొంచెం డిఫరెంట్, డిఫరెంట్ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తే కొత్త రుచితో పాటు, ఆరోగ్యం కూడా. మష్రుమ్ తో సాధారణంగా వివిధ రకాల వంటలు, మసాలా గ్రేవీ, ఫ్రై, కుర్మా తయారు చేస్తుంటారు. కానీ మష్రుమ్ తో స్నాక్ కూడా తయారు చేయవచ్చు ఇందులో పుష్కలమైన న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మష్రుమ్ తో తయారు చేసే వంటలు చాలా సులభంగా ఉంటాయి. కానీ వీటితో తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పుట్టగొడుగులు విరిగిపోతాయి. మరియు అధికంగా ఉడికించడం వల్ల టేస్ట్ కూడా పోతుంది. కాబట్టి కొంచెం మెలుకువగా తయారు చేసుకుంటే టేస్ట్ కు టేస్ట్ మరియు హెల్తీ కూడా. మరి మీరు ఈ చీజ్ మష్రుమ్ పకోడా తినాలనుకుంటే ట్రై చేసి చూడండి...

 Cheese Mushroom Pakoda

కావల్సిన పదార్థాలు:

చీజ్(జున్ను): 1/3 cup(తురుము కోవాలి)
పుట్టగొడుగులను : 15 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు : 4 (చిన్న ముక్కలుగా తరగాలి)
వెల్లుల్లి : 4 (పేస్ట్ చేయాలి)
శెనగపిండి : 1/3
Cornflour : 2tbsp
బేకింగ్ సోడా : ½tsp
బ్రెడ్ ముక్కలు : 1cup
నల్ల మిరియాలు : ½tbsp
ఉప్పు: రుచికి సరిపడా
వేయించడానికి నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఇక బౌల్ తీసుకొని అందులో చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్ మరియు పచ్చిమిర్చి వేసి, బాగా మిక్స్ చేయాలి.

2. తర్వాత మరో గిన్నె తీసుకొని అందులో శెనపిండి, కార్న్ ఫ్లో, బేకింగ్ సోడా, నూనె వేసి, కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

3. తర్వాత మష్రుమ్ కాడలు తీసేసి, ముందుగా మిక్స్ చేసి పెట్టుకొన్న చీజ్ మిశ్రమాన్ని అందులో ఫిల్ చేయాలి.

4. ఇప్పుడు శెనగపిండి, కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో డిప్ చేసి, బ్రెడ్ పొడి దొర్లించి, కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చీజ్ మష్రుమ్ పకోడా రెడీ. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.

English summary

Cheese Mushroom Pakoda: Evening Snack

It is that time of the day to make one of the favourite dishes for children, mushrooms! The white button mushroom is a well known dish among children and adults too. White button mushrooms have a lot of nutrients and proteins which is good for one's health.
Story first published: Thursday, August 1, 2013, 17:44 [IST]
Desktop Bottom Promotion