For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ ఈవెనింగ్ స్నాక్: చికెన్ చీజ్ కబాబ్

|

చికెన్ చీజ్ కబాబ్స్ ఎప్పుడూ ఉపయోగించనటువంటి కాంబినేషన్. చికెన్ మరియు చీజ్ వంటలను విడి విడిగా టేస్ట్ చూసి ఉండవచ్చు . ఐతే ఈ రెండింటి కాంబినేషన్ పిజ్జా లేదా సాండ్విచ్ లో మాత్రమే ఉపయోగిస్తారు. ఇది పార్టీ స్పెషల్ స్నాక్. ఈరెండింటి కాంబినేషన్లో తయారు చేసే ఈ స్నాక్ చాలా స్పైసీగా ఉంటుంది.

చికెన్ కబాబ్స్ ను చికెన్ తో తయారు చేయడానికి మిన్స్డ్ చికెన్ కావాలి. ఎందుకంటే చికెలో పల చీజ్ ఫిల్ చేసేందుకు సులభంగా ఉండేందుకు ఇలా మెత్తగా తయారు చేసుకుంటారు. ఇది పార్టీలో ఏదైనా డ్రింక్ తో తీసుకుంటే భలే మజా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
చికెన్ ముద్ద: (500 grams)
చీజ్(తురుము): 1cup
ఉల్లిపాయ: 1(కచపచదంచుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tbsp
నిమ్మరసం:2 tbsp
పచ్చిమిర్చి: 5 (దంచుకోవాలి)
పెప్పర్: 1 tblp
కారం: 1 tsp
గరం మసాలా: 1 tbsp
నట్మెంగ్ పౌడర్: 1 tsp
కొత్తిమీర తరుగు: 1 tbsp
ఎగ్ వైట్: 2 (రెండు గుడ్లను పగులగొట్టి అందులోని వైట్ ను మాత్రం తీసుకోవాలి)
మైదా : 1 cup
కార్న్ ఫ్లోర్: 2 tbsp
నూనె: 1cup (for deep frying)
ఉప్పు రుచికి సరిపడా

Chicken n Cheese Kebab

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డు, చీజ్, మరియు కార్న్ ఫ్లోర్ తప్ప మిగిలిన అన్ని పదార్థాలను వేయాలి.
2. అలాగే అందులో మిన్స్డ్ చికెన్(చికెన్ ను మిక్సీలోగ్రైండర్ లో వేసి కొంచెం ముద్దగా తయారు చేసుకోవాలి) కూడా బౌల్లో వేసి వీటన్నింటిని కలగలపాలి. మసాలాలన్నిచికెన్ తో బాగా మిక్స్ అయ్యేలా కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పడు మరో బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి. అప్పుడే కట్ లెట్ మంచి ఆకారం కలిగి ఉంటుంది.
4. ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకొన్ని మిశ్రమాన్ని కబాబ్ లా చేసుకొని మద్యలోనికి వత్తి లోపల చీజ్(జున్ను)పెట్టి తిరిగా పూర్తిగా కవర్ చేసి ఇనప చువ్వక చెక్కాలి. ఇలా అన్ని కబాబ్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి కాగనివ్వాలి.
6. అంతలోపు గుడ్డు పగులగొట్టి మరో గిన్నెలో తీసుకొని అందులో కబాబ్ లను డిప్ చేసి, కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండిలో) దొర్లించి వీటినికాగే నూనెలో నిదానంగా విడవాలి. అంతే ఈ చీజ్ కబాబ్స్ ను డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయాలి. వీటిని ఉల్లిపాయాలు లేదా రైతా తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటాయి.

English summary

Chicken n Cheese Kebab Recipe | టేస్టీ ఈవినింగ్ స్నాక్ చికెన్ చీజ్ కబాబ్

Chicken Cheese Kebabs are an unusual combination. You may have tasted chicken and cheese recipes before but they are either sandwiches or pizza. This special party snacks combines chicken and cheese in an unusual arena, that of kebab recipes. The spices used for this chicken and cheese recipe will not match any you have had before.
Desktop Bottom Promotion