For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ గుజియా(కొబ్బరి కజ్జికాయలు)

|

Coconut Gujiya
కోకోనట్ గుజియా పర్ ఫెక్ట్ ఇండియన్ డిసర్ట్. ఇది ట్రెడిషినల్ స్వీట్. అన్ని శుభకార్యాలకు, పండగలకు ఈ స్వీట్ ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ స్పెషల్ స్వీట్ రిసి కొబ్బరి తురుముతో తయారు చేసి షుగర్ సిరఫ్ లో వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. కోవా బదలుగా పాల పొడిని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
పిండి కలుపుకోవడానికి కావల్సినవి:
మైదా: 2cups
రవ్వ : 1/2cup
పంచదార పొడి: 1tbsp
నీళ్ళు: 1.5cup

లోపల ఫిల్ చేయడానికి:
కొబ్బరి తురుము: 2cup
గసగసాలు: 1/4cup
పాల పొడి: 1/2cup
ఫ్రెష్ క్రీమ్: 1cup
బాదాం: 10(చిన్నగా కట్ చేసుకోవాలి)
యాలకులు పొడి: 1tsp
పంచదార: 1cup
నూనె: 3tbsp
నెయ్యి: 1tbsp
పంచదార సిరఫ్: 2cup

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పిండి కలుపుకోవడానికి తీసుకొన్న పదార్థాలన్నింటిని వేసి కొద్దిగా నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో మిక్స్ పౌడర్, ఫ్రెష్ క్రీమ్ వేసి రెండు మూడు నిముషాల పాటు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
3. బ్రౌన్ కర్ వచ్చేటప్పుడు అందులో కొబ్బరి తురుము, యాలకుల పొడి, బాదం పలుకులు, పంచదా వేసి బాగా కలుపుకొని, స్టౌ మీద నుండి క్రిందికి దింపుకోవాలి.
4. ఈ మిశ్రమం కొద్ది సేపు బాగా చల్లారనివ్వాలి. అంతలోపు చపాతీ పిండిని చిన్ని చిన్న ఉండాలుగా చేసుకొని వాటిని చిన్న పూరిల్లా వత్తుకోవాలి.
5. ఇలా వత్తుకొన్న వాటి ఒకటి లేదా రెండు చెంచాలా స్టఫింగ్ మిశ్రమాన్ని మద్యలో పెట్టి మడుచుకోవాలి. కజ్జికాయలు వత్తే ఫ్రేమ్ ను ఉపయోగించి కావలసిన ఆకారాలు సెలక్ట్ చేసుకోవచ్చు.
6. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో కోకోనట్ మిశ్రమంతో తయారు చేసిన కజ్జికాయలను వేడి నూనెలో వేసి, తక్కువ మంట మీద గోల్డ్ కలర్ వచ్చేంతవరకూ వేయించుకోవాలి.
7. ఇలా తయారు చేసుకొన్న కొకొనట్ కజ్జికాయలను సుగర్ సిరఫ్ లో వేసి తీసి ప్లేట్ లో పెట్టి, చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి. ఇవి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే కోకోనట్ గుజియా రెడీ...

English summary

Coconut Gujiya.. Special Sweet | కోకోనట్ గుజియా..

Coconut Gujiyas are the perfect Indian dessert to celebrate this bitter-sweet relationship with your brother. Gujiya is a traditional recipe. Apart from being a popular sweet dish Gujiyas are also prepared on other auspicious occasions like Holi and Diwali.
Story first published: Tuesday, October 16, 2012, 17:01 [IST]
Desktop Bottom Promotion