For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకోనట్ మిల్క్-సేమియా పాయసం: దీపావళి స్పెషల్

|

హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే దీపావళి పండుగ. దీపావళి వచ్చేస్తుంది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో.. ఇంటినిండా బంధువులు, స్నేహితులతో సందడిగా జరుపుకొనే పండుగ దీపావళి. పిల్లలు, పెద్దలతో సహా అంతా సరదాపడే పండుగ కూడా దీపావళే. దీపావళి ప్రత్యేకం దీపాలంకరణ అయితే, పిల్లలంతా టపాసులు కాల్చాక అమ్మ చేతి తీపి వంటకాలు ఆనందంగా ఆరగించడం.

దీపావళి స్పెషల్‌ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్‌తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్‌ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్‌ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు. అటువంటి స్వీట్‌ డిష్‌లో పిల్లలకెంతో ప్రీతికరమైన స్వీట్ కోకోనట్ సేమియా పాయసం మరి దీన్నిఎలా తయారుచేయాలో చూద్దాం...

Coconut Milk-Semiya Payasam

కావలసిన పదార్థాలు:
సేమ్యా: 1cup
పాలు: 1/2ltr
చిక్కని కొబ్బరిపాలు: 1/2cup(పచ్చికొబ్బరి తురిమి గ్రైండ్‌ చేసి వడగట్టిన కొబ్బరి పాలు)
పంచదార :11/2cup
నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు: 3tsp(అన్నీ కలిపి)
జీడిపప్పు పొడి: 2tsp
యాలకులపొడి: 1/2tbsp
ద్రాక్ష, జీడిపప్పు, బాదం: 1/4cup(అన్నీ కలిపి)

తయారు చేసే విధానం:
1. ముందుగా పాన్‌ లో నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు విడివిడిగా వేయించాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి.
2. తర్వాత అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు, ద్రాక్ష, బాదం దోరగా వేయించి, పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్‌లో మరికొద్దిగా నెయ్యి వేసి, సేమ్యాను వేయించి పెట్టుకోవాలి.
4. అంతలోపు మరో పాన్ లో పాలు పోసి, కాగాక కొబ్బరిపాలనూ చేర్చి, మరోసారి మరగనివ్వాలి.
5. ఇప్పుడు సన్నని మంటపై ఉంచి, సేమ్యా వేయాలి. కొద్ది సేపటి తర్వాత పంచదార కలపాలి.
6. ఆతర్వాత అరకప్పు పాలల్లో ముందుగా సిద్ధంచేసిపెట్టుకున్న పొడిని కలిపి, మరుగుతున్న పాలల్లో వేయాలి.
7. పది నిమిషాలయ్యాక జీడిపప్పు, యాలకులపొడి వేసి బాగా కలపాలి. నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు వేయడం వల్ల రుచితో పాటు, చిక్కదనం వస్తుంది.
8. చివరగా జీడిపప్పు, ద్రాక్ష, బాదంతో గార్నిష్‌ చేయాలి. అంతే, కొబ్బరిపాల సేమ్యా పాయసం రెడీ! దీన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Coconut Milk-Semiya Payasam

Payasam is usually the last item served in a traditional South Indian meal, as dessert. 
 Semiya Payasam is one of the staple dish which we make for every occasions. Traditionally it is made with milk, sugar. This recipe uses vermicelli (semiya) as the main ingredient. Vermicelli in India is made from semolina and is known as seviyan in Hindi and as semiya in Tamil. Semiya payasam is also known as kheer in North India.
Story first published: Monday, October 20, 2014, 16:04 [IST]
Desktop Bottom Promotion