యమ్మీయమ్మీ స్నాక్ రిసిపి : ఓట్స్ టిక్కీ రిసిపి: (వీడియో)

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సహజంగా చాలా మంది టేస్టీ ఫుడ్ తినాలని కోరుకుంటారు. అయితే ఇప్పటి నుండి ఆ ఆలోచనను పక్కన పెట్టండి. టేస్ట్ మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి, ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో హెల్తీ ఫుడ్ తయారుచేసుకుని తినాలి. ఓట్స్ తో తయారుచేసిన ఫుడ్ ఇతర ఫాస్ట్ ఫుడ్స్ కంటే బెటర్ టేస్ట్ ను అందిస్తుంది.

ఓట్స్ లో ఫైబర్ , కార్బోహైడ్రేట్స్, స్ట్రార్చ్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి, ఆరోగ్యానికి మంచిది. డైట్ ను అనుసరించే వారు, బరువు పెరగకుండా ఉండాలంటే, ఓట్స్ తో తయారుచేసిన ఆహారాలను తీసుకోవాలి.


అలాగని రోజూ పాలలో కలిపిన ఓట్ మీల్ తినడానికి ఇష్టపడరు . అందువల్ల ఒక టేస్టీ డిష్ పరిచయం చేస్తున్నాము. ఓట్స్ కట్ లెట్, ఇది రుచి మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా..ఓట్స్ టిక్కీ లేదా కట్ లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం


ఎంతమందికి వండించవచ్చు - 4

పదార్థాలు సిద్దం చేసుకోవడానికి పట్టే సమయం: 15 minutes

వంట తయారుచేయడానికి పట్టే సమయం: 12 minutes

 కావల్సిన పదార్థాలు :

కావల్సిన పదార్థాలు :

1.రోల్డ్ ఓట్స్ - 1 cup

2. కాటేజ్ చీజ్ - ¼th cup (తురిమినది)

3. క్యారెట్ - ¼th cup (తురిమినది)

4. బంగాళదుంపలు - ½ cup (ఉడికించి, మ్యాష్ చేసినవి)

5. కొత్తమీర - 2 tbsp (సన్నగా తరిగినవి)

6.కారం - 1 tsp

7. నిమ్మరసం - 1 tsp

కావల్సిన పదార్థాలు

కావల్సిన పదార్థాలు

8. అల్లం పేస్ట్ - 1½ tsp
9.పచ్చిమిర్చి పేస్ట్ - 1½ tsp
10. గరం మసాలా - 1 tsp
11. మ్యాంగో పౌడర్ - 1 tsp
12.ఉప్పు రుచికి సరిపడా
13. లోఫ్యాట్ మిల్క్ - ¼th cup
14. నూనె - 1½ tbsp (వండటానికి మరియు గ్రీజ్ చేయడానికి)

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

1.ఒక బౌల్లో ఓట్స్ తీసుకోవాలి. అందులో పనీర్, క్యారెట్స్, పొటాటో, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కారం, గరం మసాలా, మామిడి పౌడర్, ఉప్పు వేయాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

ఈ పదార్థాలన్నింటిని బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చిలకరించి, మళ్లి మిక్స్ చేయాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

3. ఇప్పుడు, కలుపుకున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, టిక్కీలా ఒత్తుకుని, అన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

4.టిక్కీని పాలలో డిప్ చేసి, ఓట్స్ పౌడర్ లో రోల్ చేసి పెట్టుకోవాలి.

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడిఅయ్యాక నూనె రాయాలి. తర్వాత టిక్కీ ని ప్లాన్ లో పెట్టి రెండి వైపులా నూనె వేస్తూ నిధానంగా కాల్చుకోవాలి. .

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

6. కట్ లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతుందో అప్పుడు, స్టౌవ్ ను ఆఫ్ చేసి, ప్లేట్ లో కట్ లెట్ ను తీసి పెట్టుకోవాలి..

తయారుచేయు విధానం :

తయారుచేయు విధానం :

7.అంతే వేడి వేడి టిక్కీ రెడీ. దీన్ని కొత్తిమీర లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ ఓట్ మీల్ రిసిపి రెడీ..


English summary

Easy Oats Tikki Recipe

People have the strong idea that healthy foods never are tasty. This is the time to delete this idea from your mind. If you get healthy foods like oats cutlet, you will know how it tastes better than any other fast foods.
Please Wait while comments are loading...
Subscribe Newsletter