Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
క్రిస్ మస్ స్పెషల్ ఎగ్ లెస్ కర్డ్ కేక్

మైదా: 2cups
చిక్కటి పెరుగు: 1cup
పంచదార: 1cup
బేకింగ్ పౌడర్: 1tsp
వంటసోడా: 1/2tsp
వెనిలా ఎసెన్స్:1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాను జల్లించి, పక్కన ఉంచాలి. చిక్కటి పెరుగుని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, పంచదార, కూడా వేసి పూర్తిగా కరిగేలా కలపాలి.
2. బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ లను ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి రెండు నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమంలో బుడగలు వస్తుండగా, కొద్ది కొద్దిగా మైదా పిండి వేస్తూ ఉండలు కట్టకుండా, జారుగా కలుపుకోవాలి.
3. మిశ్రమం గట్టిగా ఉందనిపిస్తే.. మరికొంత పెరుగు వేసి కలుపుకోవచ్చు. తరువాత నెయ్యిరాసి ఉంచిన బేకింగ్ టిన్ లో, పై మిశ్రమాన్ని పోయాలి.
4. ముందుగానే వేడి చేసి ఉంచిన మైక్రోఓవెన్ లో 50 నిమిషాల పాటు 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికించాలి.
5. కేక్ ఉడికిందో లేదో చాకుని మౌల్డ్ మధ్యలో గుచ్చితే పిండి అంటకుండా ఉండాలి. కేక్ ఉడికినట్లయితే.. ఓవెన్ ను ఆఫ్ చేసి 5 నిమిషాల తరువాత బయటకు తీయాలి. బయటి వాతావరణంలో పది నిమిషాలపాటు చల్లబర్చి, పాత్ర నుండి బయటకు తీసి ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే ఎగ్‌లెస్ కర్డ్ కేక్ రెడీ. (పిండికి సరిపడా పెరుగును చేర్చితేనే కేక్ రుచికరంగా ఉంటుంది).



Click it and Unblock the Notifications











