For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యానికి-ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్

|

సాధారణంగా ఆమ్లెట్ ను చాలా రకాలుగా వండుతారు. చాలా ఆకలిగా ఉన్నప్పుడు చిటికెలో తయారు చేసుకొని తినగలిగే అల్పాహారం ఎగ్ ఆమ్లెట్. డైయట్ ను పాటించే వాళ్ళు పచ్చసొన ఫాట్, కొలెస్ట్రాల్ శాతం అధికం అనుకొనే వాళ్ళు ఎగ్ వైట్ తో ఆమ్లెట్ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యం.

అయితే మరింత టేస్టీగా మరిన్ని పోషకాలు, క్యాలరీలు శరీరానికి అందివ్వాలంటే అందులో ఆకు కూరలు కూడా జత చేసి ఆమ్లెట్ తాయారు చేసుకొని తినొచ్చు. ఇది పిల్లలకూ పెద్దలకూ మంచి పౌష్టికాహారం. అల్పాహారం. ఆకుకూరలు తినమని మారాం చేసి పిల్లలకు ఈవిధంగా తయారు చేసి ఇవ్వడం వల్ల వారికి ఈ విధంగా పోషకాలు అంధించవచ్చు. కాబట్టీ మీరూ తయారు చేసి చూడండి...

Egg White Omelette With Spinach

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4 (whites only)
పాలు: 1tbsp
పెప్పర్: 1tsp
పాలక్: 1 sprig (chopped)
మెంతి: 1/2tsp
ఆయిల్: తగినంత
కొత్తిమీర, పొదీనా: 1 sprig (chopped)
పొదీనా: 5 (chopped)
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గుడ్డు పగులగొట్టి అందులోని తెల్ల సొనని మాత్రమే బౌల్లోనికి జాగ్రత్తగా వంచుకోవాలి.
2. పచ్చసొనను మీరు వేరే వంటకానికి ఉపయోగించుకోవచ్చు లేదా పడేసేయండి.
3. ఇప్పుడు ఎగ్ వైట్ కు పాలు కలిపి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో ఉప్పు, సన్నగా తరిగిపెట్టుకొన్న పాలాకు, మెంతి, కొత్తిమీర, పొదీనా అన్ని వేసి బాగా గిలకొట్టాలి.
4. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి అయ్యాక అందులో బీటెన్ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి రెండు నుండి ఐదు నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. మూడు నాలుగు నిముషాల తర్వాత ఆమ్లెట్ ను ఫోల్డ్ లేదా రోల్డ్ చేసి మరి రెండు నిముషాలు ఫ్రై చేయాలి. అంతే ఆకుకూరలతో ఎగ్ వైట్ ఆమ్లెట్ రెడీ. ఈ ఆమ్లెట్ ను ఫ్రెగా కట్ చేసిన టమోటో, లేదా కీరకాయ ముక్కలతో బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం రోజంతా కావల్సిన శక్తిని అందిస్తుంది.

English summary

Egg White Omelette With Spinach | హెల్తీ అండ్ లోఫాట్ ఎగ్ వైట్ ఆమ్లెట్

Many people have to give on omelets in their 40s because they have high cholesterol. But then omelet recipes are a favourite with everyone. So, how do we make omelet recipes healthy? There is a very simple way; you can make white omelets instead of the normal ones. We all know that the egg yolk is the fatty and cholesterol rich part of the egg. It is also the tastiest part of the egg.
Desktop Bottom Promotion