For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రైడ్ చికెన్ వాన్ టన్ స్నాక్ రిసిపి

|

వాన్ టెన్ ఒక బెస్ట్ ఫ్రైడ్ స్నాక్ రిసిపి. ఈ స్నాక్ ను అందరూ ఇష్టపడుతారు. ఇది ఈవినింగ్ టైమ్స్ లో తినేటటువంటి ఒక అద్భుతమైన ఫ్రైడ్ స్నాక్. ఈ స్నాక్ ను ఫ్రై చేసి లేదా ఆవిరిలో ఉడికించి తినవచ్చు . ఫ్రైడ్ వాన్ టెన్ చికెన్ రిసిపిని పచ్చిమిర్చి లేదా అల్లం సాస్ తో సర్వ్ చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.

ఈ ఫ్రైడ్ చికెన్ వాన్ టెన్ రిసిపి తయారు చేయడం చాలా సులభం. ఇది తయారు చేయడానికి ఎక్కువ ఓపిక అవసరం. అయితే, ఒక్క సారిగా ఈ వంటను తయారుచేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ వాన్ టెన్ చికెన్ ఫ్రైడ్ రిసిపి మీకు నచ్చుతుంది. దాంతో మీకు శ్రమ అనిపించదు. మరి ఈ నోరూరించే చికెన్ ఫ్రైడ్ వాన్ టెన్ స్నాక్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Fried Chicken Wontons Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 500grm(ఉడికించి , చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలిన)
క్యారెట్స్ : 1cup(తురుముకోవాలి)
కార్న్ స్ట్రార్చ్ : 2tbsp
సోయా సాస్ : 1tsp
అల్లం : 1tbsp(తురుముకోవాలి)
వాటర్ చెస్ట్ నట్స్: ¼cup(పొడి చేసుకోవాలి)
వాన్ టన్ వ్రాపర్స్: 1 పాకెట్
వెన్న : 2tsp
కనోలా ఆయిల్ : 2tsp
స్వీట్ అండ్ సోర్ సాస్: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె: ఫ్రై చేయడానికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి మరియు అందులో చికెన్, క్యారెట్ తురుము మరియు వాటర్ చెస్ట్ నట్స్ పొడి వేసి, బాగా మిక్స్ చేయాలి.
2. మరో చిన్న గిన్నెలో కార్న్ స్టార్చ్, నీళ్ళు, సోయా సాస్, మరియు అల్లం, వేసి బాగా మిక్స్ చేసి స్మూత్ గా దోసెపిండిలా కలుపుకోవాలి.
3. ఇప్పుడు అందులో చికెన్ మిశ్రమాన్ని (1టీస్పూన్)వేసి, ఫ్లాట్ స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు వాంటెన్ వ్రాపర్ కు క్రింద డాంప్ పేపర్ టవల్ చుట్టు పెట్టుకోవాలి. మీరు అన్ని సిద్దం చేసుకొన్నాక దీన్ని ఉపయోగించాలి.
5. ఇప్పుడు వాంటెన్ కవర్ మద్యలో ఒక టీస్పూన్ చికెన్, కార్న్ స్ట్రార్చ్ మిశ్రమంతో ఫిల్ చేయాలి.
6. ఈ పదార్థాన్ని వ్రాపర్ మీద నిదానంగా సర్ధాలి. తర్వత క్రింది బాగంలో గట్టిగా పట్టుకోవాలి. తర్వాత పూర్తిగా ఫిల్ చేయాలి.
7. ఇప్పుడు మీ చేతి వేళ్ళను ఉపయోగించి, ఈ వ్రాపర్ ను సైడ్స్ లో మడిచిపెట్టాలి. మద్యలో మిశ్రమం అలాగే ఉంచాలి.
8. మిగిలిన పాయింట్స్ కూడా కవర్ చేసి పై బాగంలో నీటిని తడి చేసుకొని మూసివేయాలి. కార్నర్స్ లో కూడా వాంటెన్స్ పేపర్స్ ను ప్రెస్ చేసి సీల్ చేయాలి. ఇలాగే మిగిలన వ్రాపర్స్ మరియు ఫిలింగ్ తో తయారుచేసుకోవాలి.
9. ఇలా అన్నింటిని తయారు చేసుకొన్నాకు బటర్ మరియు నూనె రెండింటి మిశ్రమాన్ని చికెన్ వాంటెన్స్ కు అప్లై చేయాలి.
10. ఇప్పుడు వీటిని కాగే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ 10-12నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
అంతే మీ ఫ్రైడ్ చికెన్ వాంటెన్స్ రెడీ. ఈ ఫ్రైడ్ స్నాక్ ను గార్లిక్ సాస్ లేదా టమోటో సాస్ తో తిని ఎంజాయ్ చేయండి.

English summary

Fried Chicken Wontons Recipe For Snack

Wontons is one of the best fried snacks which is loved by people of all age. It is a unique snack you can try out this evening. It is can be either fried or steamed. Fried chicken wontons is served with chilli or garlic sauce and the taste of this lovely fried snack is one of a kind.
Story first published: Wednesday, November 13, 2013, 17:50 [IST]
Desktop Bottom Promotion