For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూర్ణం కుడుములు: వినాయకుడికి స్పెషల్ నైవేద్యం

|

మరో 4-5 రోజుల్లో గణేష చతుర్థి రాబోతున్నది. దేశంలోనే అంగరంగవైభవంగా జరుపుకొనే ఈ గణేష చతుర్థికి వివిధ రకాల పిండివంటలు లడ్డూలు తయారుచేసి బొజ్జగణపయ్యకు సమర్పిస్తారు. ముఖ్యంగా గణేష చతుర్ధికి అటుకులు, కొబ్బరి పలుకులు, పటిక బెల్లం, నానుబియ్యం, చెరకు రసం.. చెరకు రసం, ఉండ్రాళ్ళు, కుడుములు...ఇవ్వన్నీ బొజ్జగణపయ్యకు విందు భోజనం!

దండు సహాయ అరుదెంచమని..విందారగించమని..ఆనందింపజేయమని సభక్తికంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తూ మంగళ హారితి పట్టే వేళ స్వామికి..ఈ వంటలను నైవేద్యంగా సమర్పించవచ్చు.. మరి వినాయక చవితి వంటలో పూర్ణం కుడుములు ఎలా తయారుచేయాలో చూద్దాం...

Ganesha Chaturthi Neivedyam recipe- Purnam Kudumulu

కావల్సిన పదార్థాలు:
పూర్ణం కోసం:
పచ్చిశెనగపప్పు: 1cup
బెల్లం తురుము: 1cup
ఏలకుల పొడి: చిటికెడు
కుడుముల కోసం
బియ్యం పిండి: 1cup
బెల్లం: 1/2cup

తయారుచేయు విధానం:
1. ముందుగా పచ్చిశెనగపప్పును ఉడికించి నీటిని వంపేయాలి.
2. అంతలోపు బెల్లంను పొడి చేసుకోవాలి.
3. శెనపప్పు ఉడికించిన అందులోని నీరంతా వంపేసిన తర్వాత అందులో బెల్లం, ఏలకుల పొడి కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి.
5. తర్వాత బియం పిండిలో బెల్లం పొడి వేసి కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చేసయాలి. దీనిని చిన్న చిన్న లడ్డూలులాగే చేసి ఒక్కోదాన్ని పూరీల్లా వత్తాలి.
6. ఇలా చేసిన పూరిల్లో పూర్ణం లడ్డూని పెట్టి మడత వేసి అంచులను అందంగా(కోవాపూరిలా )నొక్కుకోవాలి.
7. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్నకా వీటిని ావిరి మీద ఉడికించుకోవాలి. ఎక్కువ తీపి కావాలంటే, పైన పంచదారను చల్లుకోవచ్చు.

English summary

Ganesha Chaturthi Neivedyam recipe- Purnam Kudumulu

Poornam kudumulu are sweet stuffed rice balls that are prepared during varalakshmi puja and vinayaka chavithi in most Andhra homes. These are called as kadubu or sihi kadubu in kannada. In some parts of Andhra, kudumulu means a sweet stuffed ball while in few other parts a rice ball without stuffing means the same, in few other parts it a sweet stuffed inside rice flour covering in the shape of kadubu something like kajikaya.
Story first published: Monday, August 25, 2014, 15:45 [IST]
Desktop Bottom Promotion