For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్షాబంధన్ స్పెషల్ రాజస్థాన్ స్వీట్ ఘేవర్

|

Ghevar
ఘేవర్ స్వీట్ రాజస్థాన్ స్పెషల్ స్వీట్ రిసిపి. ముఖ్యంగా ఈ స్వీట్ పండుగల సమయంలో మరియు రాఖీ పండుగకు తప్పనిసరిగా ఈ స్వీట్ తయారు చేసుకొంటారు. కాబట్టి ఈ రాకీ పండుగ రోజున మీరు కూడా ఈ స్పెషల్ స్వీట్ ను రుచి చూడండి.

కావలసిన పదార్థాలు:
మైదా: 4cups
నెయ్యి: 2cups
నీళ్ళు: 4cups
పాలు: 1cup
బాదాం: 1tbsp(చిన్న ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
పిత్తా: 1tbsp(చిన్న ముక్కలుగా కట్ చేసుకొన్నవి)
యాలకుల పొడి: 1tsp
కుంకుమ పువ్వు: 1tsp
పంచదార: 2cups
ఫుడ్ కలర్: 1/2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాన, నెయ్యి, పాలు మరియు మూడు కప్పుల నీళ్ళు పోసి పిండిని కలుపుకోవాలి.
2. మిగిలిన ఒక కప్పు నీళ్ళలో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ కలర్ నీళ్ళను కూడు పిండిలో పోసి పిండిని మృదువుగా కలుపుకోవాలి.
3. తర్వాత ఒక స్టీలు లేదా అల్యూమినియం గిన్నె తీసుకొని అందులో సగభాగానికి నెయ్యి పోసి వేడి చేయాలి.
4. నెయ్యి వేడిఅవ్వగానే నెయ్యి మద్యలో కలిపి పెట్టుకొన్న మైదా మిశ్రమాన్ని గ్లాసుతో పోయాలి. దాన్ని మద్యలో పిండి అలాగే నిలిచి ఉండేట్లు సన్నని మంట మీద వేడి చేయాలి. తర్వాత మరో గ్లాసు పిండి తీసుకొని దాని మీదనే మళ్ళీ పోయాలి. తర్వాత పోసిన పిండి కూడా మద్యలో నిలిచి సెటిల్ అయ్యేదాకా తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు ఘేవర్ రెడీ.
5. ఇప్పుడు మరొక గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసి పంచదార వేసి సిరఫ్ ను రెడీ చేసుకోవాలి. సిరఫ్ రెడీ అయిన తర్వాత ఘేవర్ ను పంచదార సిరఫ్ లో ముంచి తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని చల్లారనివ్వాలి.
6. తర్వాత దాని మీద కుకుమపువ్వు నీళ్ళను చల్లాలి. తర్వాత బాదాం, పిస్తా, యాలకుల పొడిని చల్లి సర్వ్ చేయాలి. అంతే ఘేవర్ స్వీట్ రెడీ.

English summary

Ghevar Recipe for Rakhi Special | రక్షాబంధన్ స్పెషల్ స్వీట్ ఘేవర్

Ghevar is a Rajasthani delicacy especially prepared during the festivals of Teej & Rakhi. Learn how to make/prepare Ghevar by following this easy recipe.
Story first published:Wednesday, August 1, 2012, 18:06 [IST]
Desktop Bottom Promotion