Latest Updates
-
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..
హోం మేడ్ బాదం చాక్లెట్: వాలెంటైన్ స్పెషల్
ప్రేమికుల రోజున వివిధ రకాల బహుమతులతో వారి పాట్నర్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంటారు. అటువంటి గిప్ట్స్ లో చాక్లెట్ కూడా ఒకటి. ఖరీదైన చాక్లెట్స్ కొనడం కంటే, ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో మీరే స్వయంగా ట్రై చేయండి.
హోం మేడ్ చాక్లెట్ తయారుచేయడం చాలా సులభం మరియు చాలా రొమాటింక్ గా ఉంటుంది. మీఅంతట మీరు చాక్లెట్ తయారుచేయడం వల్ల మీ పాట్నర్ కు చాలా సంతోషం కలుగుతుంది. అందుకు కొన్నిబేసిక్ వస్తువులు ఉంటే సరిపోతుంది. బాదం, పంచదార, బట్టర్, కోకో పౌడర్. ఈ పదార్థాలు ఉపయోగించి హోం మేడ్ బాదం చాక్లెట్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కోకాపౌడర్: 2tbsp
బట్టర్: 50grms
పంచదార: రుచికి సరిపడా
పాల పౌడర్ లేదా డైరీ వైట్ నర్: 1cup
నీళ్ళు: 3/4cup
చాక్లెట్ మౌల్డ్స్: 10-15
బాదం: గుప్పెడు
వెనీలా ఎసెన్స్: 2చుక్కలు
తయారుచేయు విధానం:
1. ముందుగా నీళ్ళు, పంచదార ఒక గిన్నెలో వేసి బాగా మరిగించాలి.
2. పంచదార సిరఫ్ చిక్కగా మారుతుంది, తర్వాత గిన్నెను స్టై మీద నుండి క్రిందికి దింపి, తర్వాత అందులో పాల పౌడర్ వేయాలి.
3. బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి.
4. అందులోనే కోకపౌడర్ మరియు బటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
5. అలాగే అందులో కొన్ని చెక్కల వెనీలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఎలక్ట్రానిక్ బ్లెండలర్ లో వేసి చిక్కగా మిక్స్ చాక్లెట్ లా మిక్స్ చేసుకోవాలి
6. ఇప్పుుడు అందులో పలుకులుగా చేసుకొన్న బాదం పప్పును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చాక్లెట్ మౌల్డ్స్ లో వేసి 45నిముషాలు డీప్ ఫ్రీజ్ చేయాలి . అంతే హోం మేడ్ బాదం చాక్లెట్ రెడీ. వాటిని కలర్ ఫుల్ వ్రాపర్స్ లో చుట్టి, మీ వాలెంటైన్ రోజును గిఫ్ట్ గా ఇవ్వండి.



Click it and Unblock the Notifications











