For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్

ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్

|

సాధారణంగా మిల్క్ షేక్స్ ను వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. ఐతే చాక్లెట్ తో తయారు చేసే మిల్క్ షేక్ చాలా డిఫరెంట్ గా అద్భుతమైన రుచితో ఉంటుంది. చాక్లెట్స్ అమితంగా ఇష్టపడే వారికి, ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్ ఒక అద్భుతమైన ట్రీట్. ఈ ట్రిపుల్ మిల్క్ చాక్లెట్ బ్రోవిన్స్ మరింత రుచిని అందిస్తాయి .

మీరు ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలని అనుకుంటున్నారా, అయితే మీరు ఆలస్యం చేయకుండా ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్స్ ఇవవచ్చు . అప్పుడు వారు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

కావలసిన పదార్దాలు:
చాక్లెట్ ఐస్ క్రీంలు : 2
పాలు : 240ml
చాక్లెట్ స్ట్రాస్
క్రీమ్
చాక్లెట్ సిరప్ లేదా సాస్
స్క్రాంబుల్ బ్రోవిన్స్: 2 brownies

Chocolate Milkshake

తయారు చేయు విధానం:

1. ముందుగా పాలను ఒక గిన్నెలో పోయాలి .
2. దానికి చాక్లెట్ ఐస్ క్రీం కలపండి. సాదారణంగా రెండు ఐస్ క్రీం లు సరిపోతాయి. మీకు ఇంకా కావాలి అనుకుంటే రుచికి తగ్గట్టు గా వేసుకోవచ్చు .
3. ఇది ఒక మెత్తటి మిశ్రమంగా మారుతుంది.
4. రెండు ముక్కలు బ్రోవిన్స్ లను వేసి బాగా బ్లెండ్ చేయాలి.
5. బ్లెండ్ చేయటం వల్ల మిల్క్ షెక్ మృదువుగా వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో పోయాలి . దాని పైన క్రీమ్, చాక్లెట్ సిరప్ ని చల్లాలి.
6. చివరగా చాక్లెట్ స్ట్రాస్ వేస్తె చల్ల చల్ల ని ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్ రెడి .

చిట్కాలు:

చాక్లెట్ రుచి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ brownies వేయాలి.

హెచ్చరికలు:

గింజ లేకుండా brownies ఉపయోగించండి; గింజలు రుచిని పెంచవు.

English summary

How to Make a Triple Chocolate Milkshake | ట్రిపుల్ చాక్లెట్ మిల్క్ షేక్

Triple chocolate milkshakes are an ultimate chocolate treat for chocoholics. This milkshake gets a boost from the addition of crumbled brownies, a great way to use up yesterday's not-as-fresh brownies.
Desktop Bottom Promotion