For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పనసకాయ(జాక్ ఫ్రూట్) పాయసం: నవరాత్రి స్పెషల్

|

Jackfruit Payasam
పచ్చని మేనిఛాయతో ముద్దులొలికే పిల్లలను పనసతొనలతో పోలుస్తారు.అందానికి పనస చూడ చక్కని పోలిక. 'జాక్‌ ఆఫ్‌ ఆల్‌ అన్నట్లు అరటి పైనాపిల్‌ పండ్ల వాసన మేళవింపుతో పనస పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మంచి శక్తివంతమైన ఆహారం ఇంకా ప్రొటీన్లు, కార్బొ హైడ్రేట్లు, విటమిన్‌ 'సి, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, సోడియం, విటమిన్‌ ఎ కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. పనసకాయతో రకరకాల వంటలు చేసుకొంటారు. హల్వా, జామ్‌, చిప్స్‌, పుడ్డింగ్‌, చిప్‌, మసాలా కూర, పచ్చడి ఇలా పనసకాయ, పండుతో ఎన్నో వెరైటీలు తయారుచేస్తారు. ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్ధ పెరగడం వల్ల పనస తొనలు ప్రపంచ వ్యాప్తగా తనదైన రుచితో అందరినీ అలరిస్తోంది.

కావలసిన పదార్థాలు:
పనసకాయ తొనలు: 1cup
బెల్లం తురుము: 1-2cups(పనసకాయ స్వీట్ చూసుకొని)
కొబ్బరి నీళ్ళు: 1cup
యాలకుల పొడి: 1tsp
బాదం: 8
జీడిపప్పు: 8
ఎండు ద్రాక్ష: 8
ఉప్పు: చిటికెడు
బియ్యం పిండి: 2-3tsp
నెయ్యి: 2-3tsp

తయారు చేయు విధానము:
1. మొదటగా పాన్ స్టౌ మీద పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చిన్న గిన్నెతీసుకొని అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్ళు వేసి బాగా కాగనివ్వాలి. బెల్లం తురుము వేడి నీటిలో కరిగిపోయేలా చూసుకోవాలి. అందులోనే కొబ్బరి నీళ్ళు పోసి బాగా రెండింటిని మిక్స్ అయ్యేలా చూసుకోవాలి
3. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి పనసతొనలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు తక్కువ మంట మీద వేయించాలి.
4. తర్వాత వేయించిన పనసతొనలను, బెల్లం, కొబ్బరినీళ్ళతో తయారుచేసుకొన్న సిరఫ్(పాకం)లో వేసి మొత్తగా అయ్యే వరకూ ఉడకబెట్టుకోవాలి.
5. తర్వాత అందులో బియ్యంపిండి వేసి కొద్దిగా చిక్కబడే వరకూ ఉడకనివ్వాలి. అంతే జాక్ ఫ్రూట్ పాయసం రెడీ..గార్నిష్ గా వేయించి పెట్టుకొన్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ నవరాత్రి స్పెషల్ వంటకం రెడీ...

English summary

Jackfruit Payasam For Navratri | పనసకాయ(జాక్ ఫ్రూట్) పాయసం: నవరాత్రి స్పెషల్

This Navratri, know how to prepare the tasty payasams for the special occasion. It can't get even special with the jackfruit payasam, the rich sweet delicacy of coastal karnataka. It is heavy, filling and full of jackfruit pulp. Take a look to know how to go about with the navratri recipe.
Story first published:Thursday, September 29, 2011, 15:46 [IST]
Desktop Bottom Promotion