For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాజు(జీడిపప్పు)-పపాయ ముర్జీ

|

Kaju-Papaya Murji
కావలసిన పదార్థాలు:

బాగా పండిన బొప్పాయి పండు : చిన్నది
పంచదార : 2cups
నెయ్యి: 1cup
యాలకులు పొడి:1/2tsp
జీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది): 3tsp
బాదం తరుము : 2tsp
ఆరెంజ్ లేదా రెడ్ కలర్: 1/2tsp
మైదా : 1/2 cup
చిక్కటి పాలు: 1cup
బాదం పప్పు ముక్కలు:1tsp
కిస్‌మిస్ : 10-12
పచ్చి కొబ్బరి: 1/2

తయారు చేయు విధానం :
1. ముందుగా పప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. 5. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి.
6. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్‌ మిస్‌ లు అందంగా అలంకరిస్తే సరి 'కాజు-పప్పాయి ముర్జీ' రెడీ. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.

English summary

Kaju-Papaya Murji | కాజు(జీడిపప్పు)-పపాయ ముర్జీ

The papaya is a tropical fruit that is healthy and sweet, but knowing how to tell if one is ripe can be challenging.Here is a simple and sweet recipe to get you kickstarted. 
Story first published:Thursday, August 2, 2012, 8:45 [IST]
Desktop Bottom Promotion