For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేష చతుర్థికి వివిధ రకాలా లడ్డులూ...

|

పండుగలు వచ్చాయంటే చాలు ఏమేమి పిండి వంటలు వండాలి. దేవుడికి ఏవేవి నైవేద్యం పెట్టాలి. ఇంటికొచ్చే అథితులకు ఏమి ఆతిథ్యం ఇవ్వాలని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏవైనా వెరైటీగా చేస్తే బాగుండు అనుకుంటారు. మరి ఈ గణేష చతుర్థికి గణేషునికి ఇష్టమైన లడ్డూలను కొంచెం వెరైటీగా చేద్దామా...

మోతిచూర్ లడ్డూ

మోతిచూర్ లడ్డూ

ముందుగా శనగపిండిలో బేకింగ్ పౌడర్ కలపాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పాలు, నీళ్లు పోసి దోసె పిండిలా కలపాలి.

బాదాం లడ్డు

బాదాం లడ్డు

ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక యాలకుల పొడి వేయాలి.

చుర్మా లడ్డు

చుర్మా లడ్డు

ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక యాలకుల పొడి వేయాలి.

రవ్వ లడ్డు

రవ్వ లడ్డు

బొంబాయి రవ్వను నెయ్యి వేయకుండా దోరగా వేయించి వుంచుకోవాలి. యాలకులు పొడి చేసి వుంచుకోవాలి.

బెల్లం : కొబ్బరి లౌజు

బెల్లం : కొబ్బరి లౌజు

ముందుగా కొబ్బరి కాయను కొట్టి తురుముకోవాలి. తరువాత బెల్లాన్ని కూడా మెత్తగా తరుగుకోవాలి.


1. మోతిచూర్ లడ్డూ
కావలసిన పదార్థాలు:
పాలు: 1cup
పిస్తాపప్పు: 1tbsp
ఆరెంజ్ ఫుడ్ కలర్: చిటికెడు
నెయ్యి : వేయించడానికి తగినంత
కిస్‌మిస్: 2tbsp
బేకింగ్‌పౌడర్: చిటికెడు
పంచదార : 1/2kg
శనగపండి: 1/2kg

తయారు చేయు విధానం:

1. ముందుగా శనగపిండిలో బేకింగ్ పౌడర్ కలపాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, పాలు, నీళ్లు పోసి దోసె పిండిలా కలపాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి పోసి, కాగిన తర్వాత సన్నని రంధ్రాలు ఉన్న జల్లి మీద పిండి వేసి, లడ్డూ కోసం బూందీ తయారుచేసుకోవాలి.
3. ఇప్పుడు బూందీ బాగా వేగి, గట్టిగా కాకుండా వెంటనే ప్లేట్‌లోకి తీసుకోవాలి.
4. అంతలోపు ఒక పాత్రలో పంచదార పాకం పట్టి, అందులో పిస్తాపప్పు, ఫుడ్‌కలర్, కిస్‌మిస్, బూందీ పోసి కలపాలి. చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమాన్ని తీసుకొని, లడ్డూలు క ట్టుకోవాలి.

2. బాదాం లడ్డు

కావలసిన పదార్థాలు:
బాదాం: 25:30
శెనగపిండి: 4cups
నెయ్యి: 2cups
యాలకుల పొడి: 1tsp
పంచదార పొడి: 2cups

తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక యాలకుల పొడి వేయాలి.
2. తర్వాత అందులోనే రెండు కప్పుల శనగ పిండి వేసి తక్కువ మంట మీద పచ్చివాసన పోయే వరకూ పది నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగేటప్పుడు కమ్మనివాసనవచ్చేదాకావేయించాలి.
3. బాదం పప్పును మిక్సీలో వేసుకొని పొడి పొడిగా (కొంచెం గరుకుగా. చేసుకోవాలి.
4. ఇప్పుడు వేయించి పెట్టుకొన్న శెనగపిండిని ఒక గిన్నెలోనికి తీసుకొని అందులో బాదం పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5. ఈ మిశ్రమం కొద్ది సేపు పక్కన పెట్టే చల్లారనివ్వాలి.
6. పది నిమిషాల తర్వాత పంచదార పొడి కలపి బాగా కలగలిపి, నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసి కావలసిన సైజులో లడ్డులను వత్తుకోవాలి. అంతే బాదం బేసన్ లడ్డు రెడీ. వీటిని గాలి చొరవడని ఒక బాక్స్ లేదా బాటిల్స్ నింపుకొంటే ఒక వారం పాటు నిల్వ ఉంటాయి.

3. చుర్మా లడ్డు
కావాల్సిన పదార్థాలు:

గోధుమపిండి: 1/2kg
నెయ్యి: ఫ్రై చేసేందుకు సరిపడా
చక్కెర పొడి: 1/2kg
యాలకుల పొడి: 1tsp
జీడి పప్పు: 10
కిస్ మిస్ లు: 10

తయారు చేసే విధానం:
1 . గోధుమపిండిలో కొద్దిగా నెయ్యి కలిపి,తరువాత కొద్దిగా నీళ్లు జల్లుతూ పిండిని పొడి పొడి గా కలియబెట్టండి. ఈ పిండిని పది నిమిషాల పాటు తడి బట్టతో కప్పి వుంచండి.
2. తరువాత ఆ పిండిని గట్టిగా కలిపి పిడికిలికి సరిపడా పరిణామంలో చుట్టండి.వీటిని బాణలిలో సన్నటి మంట మీద మరుగుతున్న నెయ్యిలో ఎర్రగా ఫ్రై చేసి తీసి చల్లారబెట్టి పొడిగా దంచి,నూకల జల్లెడలో జల్లెడ పట్టి పక్కన వుంచండి.
3. ఇప్పుడు ఇలా చేసిన గోధుమ చుర్మాలో చక్కెర పొడి,యాలకుల పొడి,జీడిపప్పు,కిస్ మిస్ లను కలిపి ,కొంచెం తడి చేతితో కావాల్సిన పరిణామంలో లడ్డూలుగా చుట్టి గట్టిపడ్డాక ఆరగించండి.

4. రవ్వ లడ్డు

కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ : 2cups
పంచదార : 2cups
యాలకుల పొడి: 1tsp
జీడి పప్పు: 10
కిస్ మిస్: 10
పాలు : 1cup
నెయ్యి: 100grm

తయారు చేసే విధానం:
1. బొంబాయి రవ్వను నెయ్యి వేయకుండా దోరగా వేయించి వుంచుకోవాలి. యాలకులు పొడి చేసి వుంచుకోవాలి.
2. వేయించిన రవ్వలో చక్కర కలిపి మందపాటి గిన్నెలో ఉంచి స్టవ్ ఫై పెట్టి సన్నటి సెగ ఫై వుంచి ,కొద్దిగా నెయ్యివేసి ,కొద్దిగా పాలు చల్లాలి.యాలుకపొడి,జీడిపప్పు,కిస్ మిస్ వేసి బాగా కలపాలి.
3. మరికిన్ని పాలు వేసి ఉండ అయ్యేలా కలపాలి.మిగిలిన నెయ్యి కూడా వేసి బాగా కలిపి దించాలి.పాలు తడి చేసుకుంటూ ఉండలు చేయాలి... ఇప్పుడు రవ్వ లడ్డు తినడానికి రెడీ.

5. బెల్లం : కొబ్బరి లౌజు

కావాలసిన పదార్థాలు:
కొబ్బరికాయ: 1 లేదా 2
బెల్లం: 1/2kg
యాలకులు: 4
నెయ్యి : 50grms

తయారు చేసే విధానం:
1. ముందుగా కొబ్బరి కాయను కొట్టి తురుముకోవాలి. తరువాత బెల్లాన్ని కూడా మెత్తగా తరుగుకోవాలి.
2. ఇప్పుడు తరిగినబెల్లాన్ని,తురిమిన కొబ్బరిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా వున్నగిన్నె పెట్టి అందులో కలిపి వుంచుకున్న కొబ్బరి,బెల్లం మిశ్రమాన్ని వేసి కొంచెం నీళ్లు జల్లుతూ అడుగంటకుండా తిప్పుతూ వుండాలి.ఇలా నీళ్లన్నీ పోయేవరకు కలిపి గట్టిపడ్డాక కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ యాలకుల పొడి కూడా వేసుకోవాలి..
3. ఇలా ఉడికిన కొబ్బరి మిశ్రమాన్ని స్టవ్ మీదనుండి దించి చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు గా చుట్టుకోవాలి..అంతే తీయని కొబ్బరి లౌజు రెడీ.

English summary

Ladoo Recipes: Ganesh Chaturthi Spcl | ఐదు వెరైటీ లడ్డూ స్పెషల్స్ ....

When we think about ladoo, we recollect Ganesha with a ladoo in his hand. Ladoo is one of the favourite sweets of Lord Ganesha. As Ganesh Chaturthi has started, you have to start preparing His favourite sweets like modak and ladoos to celebrate the festival.
Story first published: Tuesday, September 18, 2012, 17:31 [IST]
Desktop Bottom Promotion