For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మసాలా గారెలు: ఉగాది స్పెషల్

|

గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మరి ఈ వంటకాన్ని ఉగాది స్పెషల్ గా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.

Masala Garelu Recipe For Ugadi

కావలసిన పదార్ధాలు :
మినప పప్పు : 1/2kg
పచ్చిమిర్చి: 2-4
కొత్తమీర తరుగు కొద్దిగా
కరివేపాకు: కొద్దిగా
జీలకర్ర: 1/4tsp
అల్లం: కొద్దిగా
మిరియాలు: 1tsp
ఉల్లిపాయలు: 4-5
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: వేయించడానికి సరిపడా
వంటసోడ : చిటికెడు

తయారు చేయు విధానం :
1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి.
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ.

English summary

Masala Garelu Recipe For Ugadi

People from South India are gearing up for the most happening festival of the year - Ugadi. This harvest festival signals the beginning of a new year for the people of Karnataka, Andhra Pradesh and other allied areas.
Story first published: Friday, March 21, 2014, 18:40 [IST]
Desktop Bottom Promotion