For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోవా మాల్పువా-దీపావళి స్పెషల్ స్వీట్

|

మాల్పువా ఒక ట్రెడిషినల్ ఇండియన్ స్వీట్ రిసిపి, ఇది సాధారణంగా ఫ్రై చేసిన పాన్ కేక్. ఈ పాన్ కేక్ ను షుగర్ సిరప్ లో వేసి డిప్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా పండుగ వేళల్లో తయారుచేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పాటు, బందువులు, స్నేహితులను ఆనంద పరచాలంటే ఈ స్పెషల్ జైపుర్ కోవా మాల్పువా తయారుచేయాల్సిందే..

దీపావళి రోజు అనేక పిండివంటలు, స్వీట్ తయారుచేస్తారు. అయితే ఎప్పుడూ చేసినవే కాకుండా కాస్త వెరైటీగా చేయాలంటే, ఈ కోవా మాల్పువాను ప్రయత్నించండి. ఈ రిసిపి చాలా సులభం, మన ఇంట్లోనే చాలా తేలికగా, తక్కువ సమయంలో తయారుచేసుకోనే ఒక అద్భుతమైన టేస్ట్ కలిగినది. కేవలం పిండిని చిక్కగా కలుపుకొని, నెయ్యిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కావల్సిన పదార్థాలు:

పాలు: 1 ½cup(వెచ్చని పాలు)

కోవా: ½cup(తురుము)

మైదా:1cup

సోంపు: 1tsp(మెత్తగా పొడి చేసుకోవాలి)

చక్కెర: 2tsp

ఉప్పు : ఒక చిటికెడు

బేకింగ్ పౌడర్: చిటికెడు

నెయ్యి: వేగించడానికి కొద్దిగా

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

చక్కెర సిరప్ కోసం

పంచదార: 1cup

నీటి : ¼

ఏలకులు: 2-3 (పౌడర్ చేసుకోవాలి)

కుంకుమ పువ్వు : కొద్దిగా

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

తయారుచేయు విధానం:

1. ముందుగా పాన్ లో కొద్దిగా పంచదార, యాలకులపొడి, కుంకుమ పువ్వు మరియు నీళ్ళు పోయాలి.

2. షుగర్ సిరఫ్ తయారయ్యే వరకూ ఉడికించుకోవాలి. పాకంలా తయారైన తర్వాత ఈ సిరప్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత ఒక బౌల్లో సగం కోవా మరియు సగం గోరువెచ్చని పాలు పోసి బాగా మిక్స్ చేసి.

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

తయారుచేయు విధానం:

4. పాలలో కోవా బాగా కలసిపోయోంత వరకూ మిక్స్ చేయాలి.

5. తర్వాత అందులోనే మైదా కూడా వేసి మెత్తని పేస్ట్ లా మ్రుదువుగా కలుపుకోవాలి.

6. తర్వాత ఇంకా మిగిలిన మైదా, పంచదార, సోంపు, మరియు బేకింగ్ పౌడర్, పాలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

తయారుచేయు విధానం:

7. తర్వాత పదినిముషాల పక్కన పెట్టుకోవాలి.

8. ఇప్పుడు ఇక వెడల్పాటి పాన్ లో కొద్దిగా నెయ్యి రాయాలి.

9. తర్వాత నెయ్యి వేడక్కక ముందే ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిని ఒక కప్పు నిండా తీసుకొని పోయాలి.

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

కోవా మాల్పువా-దీపావళి స్వీట్

తయారుచేయు విధానం:

10. తర్వాత మంటను పూర్తిగా తగ్గించి మాల్పువాను రెండు వైపులా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ కాల్చుకోవాలి.

11. తర్వాత పాన్ లో నెయ్యిలో ఫ్రై అయిన మాల్పువాను పక్కకు తీసి షుగర్ సిరప్ లో వేసి రెండు నిముషాలు వేయాలి.

12. దీన్ని అలాగే వేడిగా సర్వ్ చేయాలి . అంతే కోవా మాల్పువా రెడీ .

English summary

Mava Malpua:Diwali Special Sweet

Malpua is a traditional Indian sweet. It is basically a fried pancake dunked in sugar syrup.
Desktop Bottom Promotion